Amazon Layoffs: అమెజాన్ లో ఏఐ షాక్..! ఏకంగా 16 వేల మంది అవుట్..!
అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు కొత్త ఏడాది తొలి నెలలోనే భారీ షాక్ ఇచ్చింది. కృత్రిమ మేథ (ఏఐ)వైపు వేగంగా పయనిస్తున్న అమెజాన్ ఇందులో బాగంగా చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగా ఏకంగా 16 వేల మంది ఉద్యోగులకు షాకిచ్చింది. ఇందులో భారత్ తో పాటు విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో వీరంతా లబోదిబోమంటున్నారు.
అమెజాన్ 16వేల లేఆఫ్స్
తమ తాజా లేఆఫ్స్ 16 వేల మందిపై ప్రభావం చూపబోతున్నట్లు అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చర్య వల్ల ప్రభావితమవుతున్న వారికి మద్దతుగా నిలిచేందుకు తాము మళ్లీ తీవ్రంగా కృషి చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం సంస్థ పునర్ నిర్మాణంలో భాగమని కూడా తెలిపింది. తాము గత అక్టోబర్ లో చెప్పినట్లుగా.. ఉద్యోగుల లేయర్స్ ను తగ్గించడం, యాజమాన్యాన్ని పెంచడం ద్వారా సంస్థను బలోపేతం చేసే చర్యల్లో ఇది భాగమని పేర్కొంది.

90 రోజుల టైమ్
గతేడాది అక్టోబర్‌లోనే అనేక టీమ్స్ తమ మార్పులను పూర్తి చేసినప్పటికీ, ఇతర బృందాలు ఇప్పటివరకు ఆ పనిని పూర్తి చేయలేదని అని అమెజాన్‌లోని పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టి బ్గాగ్ లో వెల్లడించారు. అలాగే ప్రస్తుతం లేఆఫ్స్ కారణంగా ప్రభావం పడుతున్న ఉద్యోగులకు అంతర్గతంగా కొత్త పాత్ర కోసం వెతకడానికి 90 రోజుల సమయం ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.

లేఆఫ్ ఉద్యోగులకు ఇలా
అలాగే అమెజాన్‌లో కొత్త పాత్రను కనుగొనలేని వారికి లేదా దాని కోసం వెతకకూడదని భావిస్తున్న వారికి సెవరెన్స్ పే చెల్లింపు, అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు (వర్తించే విధంగా), ఇతర మద్దతును అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు అమెజాన్ తమ భవిష్యత్తుకు కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలు, విధుల్లో నియామకాలు, పెట్టుబడులు కొనసాగిస్తామని హామీ కూడా ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి లేఆఫ్స్ మాత్రం తప్పవని తేల్చేసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications