"ఐదేళ్ల తర్వాత మౌస్- కీబోర్డ్ ఉండదు.. అంతా ఏఐ తోనే"

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ తన సామర్థ్యాన్ని చాటుతోంది. మానవుడు సాధించలేని, పరిష్కరించలేని ఎన్నో సమస్యలకు ఏఐ క్షణాల్లో సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కొంత పుంతలు తొక్కుతోంది. ఏఐ ప్రతి రంగంలో క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఈ సాంకేతికత వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అటు యువత, ఉద్యోగులు సైతం ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలోని ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరిగింది.

Microsoft VP David Weston Laptops Without Keyboards Mice Coming Soon

అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెస్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కీబోర్డ్, మౌస్ లేకుండానే ల్యాప్‌ టాప్‌ ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇది ఆశ్చర్యానికి గురి చేసినా.. భవిష్యత్తులో ఏఐలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు. ఈ మేరకు 2030 నాటికి, కీబోర్డ్, మౌస్ అవసరం లేని ల్యాప్‌ టాప్‌ లను చూడబోతున్నారని హింట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ ల్యాప్‌ టాప్‌ లు వాయిస్ లేదా హావభావాలపై పనిచేయడం ప్రారంభిస్తాయని అంచనా వేశారు డేవిడ్ వెస్టన్.

తాజాగా ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ మేరకు ఇటీవల
మైక్రోసాఫ్ట్ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. రాబోయే ఐదు సంవత్సరాలలో మనం విండోస్ ను ఎలా ఉపయోగిస్తామో ఇందులో పేర్కొంది. కృత్రిమ మేధ కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌ లతో మన పరస్పర చర్యను సులభతరం చేస్తుందని ఈ వీడియో వివరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+