జెన్ జీ కిడ్స్ చరిత్రలోనే అదృష్టవంతులు..! ఎందుకో చెప్పిన ఓపెన్ ఏఐ సీఈవో..!

కృత్రిమ మేథ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలు, కంపెనీలు, ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. ఏఐ దూకుడు కారణంగా వేగంగా ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయనే ఆందోళనలు ఓవైపు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాల రాక, వేగంగా బిలియనీర్లు తయారవుతున్నారనే నివేదికలూ చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ తరంలో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటున్న జెన్ జీ కిడ్స్ చరిత్రలోనే అదృష్టవంతులని ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్ మెన్ పేర్కొన్నారు.

కృత్రిమ మేథ రాకతో ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయన్న భయాల నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పుడు దీన్ని నేర్చుకునే అవకాశం ఉన్న జెన్ జీ పిల్లలు చరిత్రలోనే అదృష్టవంతుల్ని ఆల్ట్ మన్ తెలిపారు. ఏఐ కారణంగా భారీ ఉద్యోగాల కోతలు ఉంటాయన్న ఫార్చూన్ తాజా అంచనాల నేపథ్యంలో శ్యామ్ ఆల్ట్ మెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Open AI CEO sam altman termed Gen Z kids Luckiest in Histroy- here is why

తాను చరిత్రలో అత్యంత అదృష్టవంతుడిని అని భావిస్తానంటూ శ్యామ్ అల్ట్ మెన్ హ్యూజ్ ఇఫ్ ట్రూ అనే పాడ్ కాస్ట్ లో హోస్ట్ అయిన క్లియో అబ్రహామ్ తో వెల్లడించారు. ఏఐ ఉద్యోగాల భర్తీకి కారణమవుతుందా అంటే కాదని తోసిపుచ్చారు. ఇదో చక్రమని మాత్రమే చెప్పారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుందని, యువత దీనికి అనుగుణంగా ఉండగలిగితే ఉత్తములని భావించాల్సి ఉంటుందన్నారు.

Open AI CEO sam altman termed Gen Z kids Luckiest in Histroy- here is why

ఇప్పటికే ఏఐ కారణంగా ఉద్యోగాల భర్తీపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు తమదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వేగంగా ఉద్యోగాలను భర్తీ చేసేస్తుందని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, వేగంగా బిలియనీర్ల తయారీలో కీలకంగా మారబోతోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులు కూడా ఏఐ నైపుణ్యాలు నేర్చుకుంటే తమ కెరీర్ ను పొడిగించుకోవచ్చని సూచిస్తున్నారు. దీంతో ఏఐ విషయంలో ఓవైపు ఆందోళన ఉన్నా మరోవైపు ఆశాజనక పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+