"AI కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరం"
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి సమస్యకూ ఏఐ పరిష్కార మార్గంగా నిలుస్తోంది. ఏఐను వినియోగించి కంటెంట్ ను క్రియేట్ చేసేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కీలక ప్రకటన చేసింది. ఏఐ కంటెంట్ క్రియేటర్లకు లైసెన్సులు అవసరం అని సూచనలు చేసింది. ఈ క్రమంలో ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో కంటెంట్‌ను క్రియేట్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే తాజాగా పార్లమెంటరీ ప్యానెల్ కీలక ప్రకటన చేసింది. ఏఐ సాయంతో కంటెంట్ ను క్రియేట్ చేసేవాళ్లు కచ్చితంగా లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుందని పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు చేసింది. దీంతో ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు సమాచారం.

కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే మార్గాలను కోరింది. ఈ కమిటీ ఇటీవలే తమ ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కు సమర్పించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications