రూ.5 కోట్ల జీతం.. కానీ నిద్రలేని రాత్రులు ఓకేనా!
సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఏసీ గదులు, లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, ఆన్ సైట్లు గుర్తొస్తాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఓపెన్‌ఏఐ మాత్రం ఇందుకు భిన్నమైన ఓ ఉద్యోగ ప్రకటన చేసింది. ఏటా రూ.5 కోట్ల(555,000 డాలర్లు) భారీ జీతంతో పాటు కంపెనీ వాటాలను ఆఫర్ చేస్తూ.. ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని ముందే హెచ్చరిస్తోంది. టెక్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓపెన్ ఏఐ సంస్థ.. తమ భవిష్యత్ ఏఐ మోడళ్ల వల్ల తలెత్తే ముప్పులను ముందే పసిగట్టి, వాటిని నివారించడానికి 'హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్' అనే ఈ కొత్త పోస్టును భర్తీ చేస్తోంది.
ఏమిటి ఈ 'హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్' ఉద్యోగం?
ఏఐ మోడల్స్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్నాయి. ఇవి మానవాళికి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ.. వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అవి వినాశకరమైన దారుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమే ఈ 'హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్' ప్రధాన బాధ్యత. ఏఐ అనేది కేవలం సమాచారాన్ని ఇచ్చే సాధనంగా కాకుండా, స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో తలెత్తే ముప్పులను ముందుగానే ఊహించి, వాటిని అణచివేసే సమర్థుడైన వ్యక్తి కోసం శామ్ ఆల్ట్‌మాన్ వెతుకుతున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ శామ్ ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా ఇలా పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా ఆల్ట్‌మాన్ ఈ పోస్ట్ గురించి వివరిస్తూ.. "మేము ఒక తెలియని కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. ఏఐ సామర్థ్యాలను చెడు మార్గాల్లో వాడితే జరిగే నష్టం ఊహాతీతం. దీనిపై మాకు పూర్తి అవగాహన కావాలి. ఇది చాలా కష్టమైన పని, దీనికి ముందుగా ఎటువంటి నిబంధనలు లేదా ఉదాహరణలు లేవు. అందుకే ఈ ఉద్యోగంలో చేరిన వారు వెంటనే క్లిష్టమైన సమస్యల్లోకి దూకాల్సి ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.
We are hiring a Head of Preparedness. This is a critical role at an important time; models are improving quickly and are now capable of many great things, but they are also starting to present some real challenges. The potential impact of models on mental health was something we…
— Sam Altman (@sama) December 27, 2025
ఆ ఉద్యోగి దేనిపై పోరాడాలి?
ఈ పోస్టులో పని చేసే వ్యక్తి ఎదుర్కోవాల్సిన సవాళ్లు సామాన్యమైనవి కావు. ప్రధానంగా ఈ నాలుగు అంశాలపై వారు దృష్టి పెట్టాలి.
*సైబర్ వార్‌ఫేర్: ఏఐ స్వయంగా ప్రపంచ స్థాయి సైబర్ దాడులు చేయకుండా లేదా హ్యాకర్లకు సహకరించకుండా చూడటం.
*జీవాయుధాల ముప్పు: ఏఐని ఉపయోగించి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు లేదా జీవ రసాయనాలను సృష్టించే ముప్పును అరికట్టడం.
*అటానమస్ రీజనింగ్: ఏఐ వ్యవస్థలు మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా ప్రణాళికలు వేయడం మొదలుపెడితే వచ్చే ప్రమాదాలను పసిగట్టడం.
*సామాజిక, మానసిక ప్రభావం: సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం లేదా మనుషుల ప్రవర్తనను ప్రభావితం చేసే ఏఐ అల్గారిథమ్స్‌ను నియంత్రించడం.
నియంత్రణ లేని ప్రపంచంలో భద్రత ఎవరిది?
ప్రస్తుతం ఏఐ రంగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఎటువంటి కఠినమైన నియంత్రణలు లేవు. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త యోషువా బెంగియో మాట్లాడుతూ.. "ఒక సాండ్‌విచ్‌ను అమ్మడానికి ఉన్నన్ని రూల్స్ కూడా ఏఐకి లేవు" అని ఎద్దేవా చేశారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఓపెన్ ఏఐ వంటి సంస్థలు తమంతట తామే భారీ జీతాలు ఇచ్చి మరీ భద్రతా నిపుణులను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్లలో జీతం లభిస్తున్నా, మానవాళి మనుగడనే ముప్పులో పడేసే ఏఐని నియంత్రించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత కష్టమైన టెక్ ఉద్యోగాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications