"ఏఐ వినియోగంలో భారత్ టాప్.. తర్వాతే అమెరికా"..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం కొంత పుంతలు తొక్కుతోంది. ఏఐ ప్రతి రంగంలో క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. మానవుడికి సాధ్యం కాని.. పరిష్కరించలేని అనేక సమస్యలను ఏఐ క్షణాల్లో సమాధానం ఇస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఈ సాంకేతికత వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అటు యువత, ఉద్యోగులు సైతం ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలోని ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్ మన్.. భారత్ లో ఏఐ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ ఏఐకు అమెరికా తర్వాత భారత్ అతిపెద్ద మార్కెట్ అని ఆల్ట్ మన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ వేగం చూస్తుంటే త్వరలో అమెరికాను కూడా అధిగమించగలదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా తన లేటెస్ట్ మోడల్ జీపీటీ-5 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న సంస్థ సీఈవో శామ్ ఆల్ట్ మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు శామ్ ఆల్ట్ మన్ జీపీటీ-5 పై కీలక వ్యాఖ్యలు చేశారు. జీపీటీ-5 శక్తివంతమైనదే కానీ నూటికి నూరు శాతం సరైనది కాదని తెలిపారు. ఈ మేరకు ఓ యూజర్ అడిగిన సాధారణ గణిత ప్రశ్నకు తప్పు సమాధానం ఇవ్వడం ఉదాహరణగా వివరించారు. ఇటీవల సామాజిక మాధ్యమంలో ఒక యూజర్ జీపీటీ-5 పై ఓ గణిత ప్రశ్న వేశాడు.. 19% of 450 is how much? అని ప్రాంప్టింగ్ ఇవ్వగా.. దీనికి జీపీటీ-5 తప్పు సమాధానం ఇచ్చింది. 19% of 450 అంటే 85.5 అవుతుంది. కానీ జీపీటీ-5.. 505 అని సమాధానం ఇచ్చింది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై స్పందించిన శామ్ ఆల్ట్ మన్.. జీపీటీ-5 అనేది ఇప్పటికే చాలా విషయాల్లో దాని ప్రతిభ చూపించిందని.. దీని కంటే చాలా పెద్ద విషయాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications