ప్రభుత్వ శాఖల్లో కొత్తగా AI ఛాంపియన్స్​, కేటలిస్టుల నియామకం..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ప్రయివేటు సంస్థలతో పాటుగా ప్రభుత్వాలు ఏఐ వినియోగా నికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా సాంకేతిక పరి జ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న సిబ్బందిని సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వాధ్వాని ఫౌండేషన్‌తో కలిసి శిక్షణచ్చి ఏఐ వినియోగ బాధ్యతలను అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏఐ ఛాంపియన్లు, ఏఐ కేటలిస్టుల పేరిట వివిధ శాఖల్లో సిబ్బందిని ఎంపిక చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి ఫలాలు అందాలంటే పాలనా యంత్రాంగంలో మరిం వేగం, కచ్చితత్వం, స్పష్టత అవసర మని సర్కారు భావిస్తోంది. ఇందు కోసం ఏఐ వైపు మొగ్గు చూపు తోంది. పాలనలో ఆర్టిఫిషియల్ వినియోగంపై ప్రముఖ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వాధ్వాని ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెంటనే AIని ఎక్కడ అమలు చేయవచ్చు. దీర్ఘ కాలికంగా ఎలా వినియోగించవచ్చు. ఏ విషయాల్లో ఉపయోగిస్తే ఎలాంటి ఫలి లు ఉంటాయనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. పాలనలో ఏఐ వినియోగంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. డిజిటల్, ఏఐ పాలనకు సిద్ధంగా ఉండాలని సీఎస్ రామక్రిష్ణారావు నిర్దేశించారు. ఏఐ వినియోగానికి ప్రతిశాఖలో అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసి వాద్వాని సెంటర్​ ఫర్​ గవ మెంట్​ డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​ ద్వారా శిక్షణ ఇవ్వాలని ఆభేటీలో నిర్ణయించారు.

telangana-government-is-in-the-process-of-incorporating-ai-tools-into-the-governace

ఏఐ వినియోగం కోసం ప్రయోగాత్మకంగా రాష్ట్రస్థాయిలో ఒక్కోశాఖలో ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేస్తున్నారు. వారిని ఏఐ ఛాంపియన్స్, ఏఐ కేటలిస్టులుగా వ్యవహరించేవారిని గుర్తించి వివరాలు పంపాలని ఐటీశాఖ ప్రత్యేక సీఎస్​ సంజయ్​కుమార్​ ఇటీవల అన్ని శాఖలకు లేఖలు రాశారు. డైరెక్టర్​ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి సీనియర్ అధికారి ఏఐ ఛాంపియన్​గా ఉంటారని తెలిపారు. డిజిటల్​ పరిజ్ఞానం, అవగాహన, అనుభవం, ఆసక్తి ఉన్న మిడిల్ ర్యాంక్​ అధికారులను ఏఐ కేటలిస్టులుగా ఎంపిక చేస్తారు. వారికి నాలుగు రోజులపాటు వాధ్వాని సంస్థ శిక్షణ ఇవ్వనుంది. అనంతరం నిపుణుల సమక్షంలో మూడు నెలలపాటు ఏఐ ఛాంపియన్లు, ఏఐ కేపిటలిస్టులు ప్రయోగాత్మకంగా ప్రాజెక్టులు చేస్తారు. మంత్రిమండలి సమావేశాల నిర్వహణలోనూ డిజిటల్ వినియోగంపై ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. కేబినెట్ అజెండా, టేబుల్ ఐటెమ్స్‌ను ఈఫైలింగ్ చేసి డిజిటల్ కాపీలు భద్రపరచనున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న డిజిటల్ ఆఫీస్, ఈఫైలింగ్ విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+