ఎంతకు తెగించార్రా..!!
సర్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతోంది. దీనివల్ల ప్రయోజనాల కంటే కూడా ప్రమాదమే అధికంగా ఉందని వాదనలు, అభిప్రాయాలు నానాటికీ బలపడుతున్నాయి. డీప్ ఫేక్ వంటి టెక్నాలజీ ద్వారా ఎన్ని అనర్థాలు సంభవించాయో ఇదివరకే చూశాం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా ఇలాంటి దుష్ప్రభావాలే ఎదురవుతున్నాయి.
ఇలాంటి వాదనలకు బలాన్ని చేకూర్చే వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరదల్లో ఓ రైలు పూర్తిగా మునిగిపోయినట్లు సృష్టించిన వీడియో అది. బ్రిడ్జిపై నుంచి వరద నీటిలో పడి కొట్టుకునిపోతున్నట్లు ఈ వీడియోను రూపొందించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇది వైరల్ అయింది. ఇది నిజమేనేమో అనే భ్రమను కలుగుతుంది దీన్ని చూడగానే. ఇది నిజమా? కాదా? అని ఆరా తీశారంటే- అది ఎంతలా ఆందోళనకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఈ రైలు ప్రమాదం- వాస్తవం కాదని తెలిపింది.
వీడియో డిజిటల్‌గా ఈ వీడియోను చిత్రీకరించారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఓ అభూత కల్పనగా అభివర్ణించింది. దీన్ని ఎవరూ కూడా విశ్వసించవద్దని సూచించింది. ఇలాంటి వీడియోలను సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని స్పష్టం చేసింది.
అనవసర భయాందోళనలు, గందరగోళానికి దారితీసే ఇటువంటి కంటెంట్‌ను షేర్ చేయవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రజలను కోరింది. ఆన్‌లైన్‌లో ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు లేదా ఫార్వార్డ్ చేసే ముందు అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ఇప్పటికే అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో 30 మంది వరకు మరణించారు. త్రికూట పర్వతంపై వెలిసిన ఉన్న మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు.
హిమాలయాల నుండి ప్రవహించే నదులు పొంగిపొర్లడంతో డ్యామ్‌లు, బ్యారేజీల నుండి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఇది పంజాబ్‌లోని దిగువ ప్రాంతాలలో వరదలను మరింత తీవ్రతరం చేసింది. పంజాబ్, జమ్మూ ప్రాంతంలోని పాఠశాలలను మూసివేశారు. మాతా వైష్ణో దేవి యాత్రను నిలిపివేశారు.
🚨 Digitally-Altered Video Alert!
— PIB Fact Check (@PIBFactCheck) August 26, 2025
A video showing a train submerged in floodwaters is circulating on social media.
📌 #PIBFactCheck
✅ The video is AI-generated and does NOT depict any real incident.
❌ Refrain from sharing such content, potentially causing unnecessary fear… pic.twitter.com/SZN68gdHht
హిమాచల్ ప్రదేశ్‌లో 680 రోడ్లు మూసివేశారు. మండి, కుల్లు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గత 24 గంటల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్ఫోటనం రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. దుకాణాలు కొట్టుకుపోగా, రహదారులు దెబ్బతిన్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications