ట్రాఫిక్ లోకి 'ఏఐ' కెమెరాలు.. తప్పించుకునే అవకాశమే లేదు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఓ మెట్రోపాలిటన్ సిటీ. ప్రపంచంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో 41 వ స్థానంలో ఉంది. భాగ్య నగరంలో నిత్యం ట్రాఫిక్, వాహనాల రద్దీ కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు హైదరాబాద్ లో మెట్రో రైలు సదుపాయం ఉన్నా రద్దీ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఇక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య 85 లక్షల 22 వేల 286 కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ట్రాఫిక్ కారణంగా నిత్యం ఉద్యోగాలు.. ఉపాధి కోసం వెళ్లే వాళ్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ట్రాఫిక్ వ్యవస్థలోకి ఏఐ కెమెరాలను వినియోగించనుంది. ఈ మేరకు తూప్రాన్ నగరంలో తొలిసారిగా ఏఐ కెమెరాలను బిగించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పట్టణంలో ఒక్కోదానికి రూ.1.50 లక్షలు వెచ్చించి తొమ్మిది కెమెరాలను కొనుగోలు చేసి వాటిని నగరంలోని ప్రధాన జంక్షన్ లలో బిగించారు.

ఏఐ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్ సంఖ్యను స్పష్టంగా చీకట్లో కూడా కనిపెడుతోంది. వాహనం నంబరు కొడితే వాహనం ఆ కెమెరాలో ఎన్నిసార్లు నిక్షిప్తం అయిందో పసిగడుతోంది. అంతేకాక ఎంత మంది ప్రయాణిస్తున్నారో గుర్తిస్తోంది. అలాగే ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో నిందితులు తప్పించుకునే అవకాశం తగ్గనుంది. సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్ గా వెలుగుతాయి.












Click it and Unblock the Notifications