పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి మళ్లీ సినిమాలు చేస్తోన్నారు. చాలాకాలం తర్వాత ఆమె నటించిన తొలి సినిమా విడుదల కాబోతోంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్ తో వివాహం, ఓ బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఈ చిత్రం రిలీజ్ అవుతోండటం పట్ల హైప్ క్రియేట్ అయింది. మంచి బజ్ ఏర్పడింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ మూవీని దుర్గా దేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు.

అదే- సతీ లీలావతి. మే 8వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను కొద్ది సేపటి కిందటే విడుదల చేసింది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించారు ఇందులో. గతంలో 'భీమిలి కబడ్డీ జట్టు', 'ఎస్‌ఎంఎస్ (శివ మనసులో శృతి) వంటి చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.

Actress Lavanya Tripathi Makes a Comeback in Sathi Leelavathi Romantic Drama Release set for May 8

ఇదొక రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామా. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ భార్యాభర్తలుగా నటించారు. హాస్యం, సెంటిమెంట్ కలగలిసి ఒక వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరించనుంది. చిత్రం భార్యభర్తల బంధం, వారి సంఘర్షణలను ఆకట్టుకునేలా, వినోదాత్మకంగా చూపుతుందని నిర్మాత నాగమోహన్ పేర్కొన్నారు. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రచార కార్యకలాపాలను పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

సీనియర్ నటుడు నరేష్ వీకే, కమేడియన్ సప్తగిరి, తమిళ స్టార్ హాస్యనటుడు వీటీవీ గణేష్, రాజేంద్రన్, జాఫర్, జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్ గా బినేంద్ర మీనన్ వ్యవహరించారు. సతీష్ సూర్య ఎడిటింగ్ ఈ ఫిల్మ్ కు ప్రధాన ఆకర్షణలు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+