లెనిన్ టీజర్ అవుట్: అఖిల్ ఫేట్ డిసైడర్

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం.. లెనిన్. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. లెనిన్ సినిమా ప్రతి భావోద్వేగంతో నిండిన పూర్తి స్థాయి రూరల్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదల అయింది. ఇందులో అఖిల్ టైటిల్ పాత్రలో గ్రామీణ నేపథ్యం ఉన్న కుర్రాడిగా అభిమానులను ఆకట్టుకున్నాడు. రఫ్‌ అండ్‌ టఫ్‌ అవతారంలో పూర్తిగా న్యూ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఓ చేతిలో జెండా, మరో చేతిలో మట్టిని పట్టుకుని, సాదాసీదా దుస్తులతో ఉన్న అఖిల గెటప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ పవర్ ఫుల్ భూమి పుత్రుడి క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడీ మూవీలో అఖిల్.

Akhil Akkineni Upcoming Movie Lenin teaser out Now and the Film set to Release on June 26 Makers

ఓ పూర్తిస్థాయి గ్రామీణ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. వేసవి సెలవుల నేపథ్యంలో మే 1వ తేదీన విడుదల చేయాలని ఇదివరకు నిర్ణయించుకున్నప్పటికెీ అది వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 26 తేదీ ఖరారైంది. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' పరాజయం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇప్పుడు లెనిన్ తో రీఎంట్రీ ఇస్తోన్నాడు.

మొదట శ్రీలీల కథానాయికగా ఎంపికైనా, డేట్స్ సమస్యలతో ఆమె తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. అఖిల్ పుట్టినరోజు ఏప్రిల్ 8 నాడు టైటిల్ టీజర్ విడుదలైంది. ఇప్పుడు పూర్తిస్థాయి టీజర్ విడుదల అయింది. రాయలసీమ నేపథ్యంతో కూడిన ఈ మూవీ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే యాక్షన్ డ్రామాగా చిత్రీకరణం జరుపుకొంది. పరువు హత్యల వంటి సామాజిక ఇతివృత్తాల చుట్టూ కథను అల్లుకున్నారు. ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు అఖిల్. దీనికోసం రాయలసీమ యాసలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+