టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ‘బిగ్‌షాట్’గా బండ్ల గణేష్

టాలీవుడ్‌లో మోస్ట్ వైబ్రంట్ పర్సనాలిటీ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. తనదైన స్పీచ్‌లతో, మేనరిజంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ 'బ్లాక్ బస్టర్' ప్రొడ్యూసర్.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, త్వరలోనే చిన్న సినిమాలతో, రీజనబుల్ బడ్జెట్‌తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుమల కొండకు వస్తానని మొక్కుకొని, ఇటీవలే ఆ మొక్కును తీర్చుకొని చంద్రబాబును, భువనేశ్వరిని, లోకేష్ ను కలిశారు. అలాగే 'మెగా 158' మూవీ ఓపెనింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను కలవడంతో బండ్ల గణేష్ పేరు మళ్లీ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.

Bandla Ganesh Actor Raja Ravindra revealed that the house built by producer is worth 100 crore

చిరంజీవిపై కృతజ్ఞత చాటుకున్న బండ్ల గణేష్

బండ్ల గణేష్ గతేడాది షాద్ నగర్ లో ఇల్లు కట్టుకొని అత్యంత వైభవంగా గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేసిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఇంటికి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ బయటపడింది. షాద్‌నగర్‌లో బండ్ల గణేష్ నిర్మించుకున్న ఈ లగ్జరీ హౌస్ విలువ అక్షరాలా రూ. 100 కోట్లు ఉంటుందని రాజా రవీంద్ర లీక్ చేశారు. "వంద కోట్ల ఇంటికి అధిపతివి.. నువ్వు మామూలోడివి కాదు గణేష్" అంటూ రాజా రవీంద్ర వ్యాఖ్యానించడం విశేషం. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేష్‌తో పాటు ఎందరో యువ హీరోలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. బండ్ల గణేష్‌పై ఉన్న ప్రేమతో ఈ వేడుకకు విచ్చేశారు. ఇండస్ట్రీకి చిరంజీవి 'బాస్', పెద్ద దిక్కు అనే గౌరవంతో, ఆయన కూర్చోవడానికి బండ్ల గణేష్ ప్రత్యేకంగా ఒక రాయల్ చైర్‌ను డిజైన్ చేయించారు. నడుము నొప్పి ఉన్న చిరంజీవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఆ కుర్చీని సిద్ధం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు.

వార్త బయటకు రావడంతో పోలికలు

ఈ వంద కోట్ల ఇంటి వార్త బయటకు రావడంతో టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన పోలిక మొదలైంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇళ్లు కూడా ఈ రేంజ్‌లో లేవనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి నివాసం విలువే సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని సమాచారం. అలాంటిది బండ్ల గణేష్ ఏకంగా వంద కోట్లతో ఇల్లు కట్టారంటే, ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఇంటి ధరతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బండ్ల గణేష్ కేవలం సినిమాలపైనే ఆధారపడలేదు. ఆయనకు అంతకుమించిన భారీ వ్యాపారాలు ఉన్నాయి.

ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలోఆయనకు ఉన్న బిజినెస్ నెట్‌వర్క్ చాలా పెద్దది. ఆ వ్యాపార సామ్రాజ్యం నుంచే ఆయనకు ఈ స్థాయిలో ఆదాయం వస్తుందని, అందుకే సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 'బిగ్ షాట్'గా బండ్ల గణేష్ చలామణి అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఏదేమైనా, ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్‌గా మారి.. ఇప్పుడు వంద కోట్ల ఇంటికి అధిపతి అయిన బండ్ల గణేష్ జర్నీ నిజంగానే ఒక 'బ్లాక్ బస్టర్' స్టోరీ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+