2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం
తెలుగు సినీ పరిశ్రమకు 75 సంవత్సరాలు పూర్తికావడంతో వజ్రోత్సవ వేడుకలను 2007లొ నిర్వహించారు. వజ్రోత్సవ వేడుకలు అనగానే ఇప్పటికీ సినీ ప్రియులకు, ప్రజలకు అక్కడ జరిగిన గొడవే గుర్తుకొస్తుంది. ప్రధానంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య జరిగిన మాటల యుద్ధం సంచలనాన్ని కలిగించింది. వేడుకల్లో భాగంగా నటీనటులకు అవార్డుల ప్రదానం, సత్కారాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో వేదికపై ఉన్న మోహన్ బాబు మాట్లాడుతూ, కొందరు నటులు తమను తాము 'లెజెండ్స్' అని, 'అతిరథ మహారథులు' అని పిలిపించుకుంటున్నారని, కానీ నిజమైన లెజెండ్స్ ఎవరో అందరికీ తెలుసని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణ, సీనియారిటీ గురించి ఆయన మాట్లాడిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.
చిరంజీవి కౌంటర్ ఇచ్చారు
మోహన్ బాబు వ్యాఖ్యలకు చిరంజీవి స్టేజ్ పైనే చాలా హుందాగా, అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 'కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. వజ్రోత్సవాలు లాంటి శుభకార్యంలో ఇలాంటి మాటలు సరికావు' అన్నారు. అభిమానుల మధ్య కూడా ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మోహన్ బాబు వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేదికపై మోహన్ బాబు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ సీటులో నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

వేడుకల్లో బాలకృష్ణ పాత్ర ఏంటి?
ఈ వేడుకల నిర్వహణలో బాలకృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో నందమూరి, మెగా క్యాంప్‌ల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వేడుకలు పరిశ్రమ ఐక్యతను చాటాల్సింది పోయి, అగ్ర హీరోల మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయని విమర్శలు వచ్చాయి.
అయితే, కొన్నేళ్ల తర్వాత 'మా' డైరీ ఆవిష్కరణలో చిరంజీవి, మోహన్ బాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, "మేము బ్రదర్స్ లాంటి వాళ్లం, మా మధ్య గొడవలు ఉండవు" అని స్పష్టత ఇచ్చి వివాదానికి ముగింపు పలికారు. అయితే అది పైపై అని తర్వాత కూడా ప్రజలందరికీ అర్థమైంది. తరుచుగా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు రేగుతూనే ఉన్నాయి. మాటలు అంటూనే ఉన్నారు. కౌంటర్లు ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఐక్యత అనేది ఎండమావిలా కనపడుతుంటుంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications