మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు
మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను పట్టుకొని పక్క రాష్ట్రం అని మాట్లాడటం,పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.దీనికి సంబంధించి వెబ్ సైట్లలో ఏ వార్త చూసినా,యూట్యూబ్,ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్ లో ఏ వీడియో చూసినా దానికింద వందల సంఖ్యలో,వేల సంఖ్యలో చిరంజీవికి వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి.ఇది చూసి మెగా అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.తమ హీరోపై ఇంత వ్యతిరేకత ఉందా? అనుకుంటున్నారు.
ఎవర్ని చూసి ఎవరు స్ఫూర్తి పొందాలి?
మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని పెద్దలు చెబుతారు. అయితే చిరంజీవి సాధారణమైన ఉద్దేశంతో అన్నప్పటికీ, అది అప్పటికే తీవ్ర వ్యతిరేకతను క్షణాల్లో మూటగట్టుకొచ్చింది. తెలంగాణ గద్దర్ అవార్డుల సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.దీంతో ఒక్కసారిగా నెటిజన్లు తగులుకున్నారు.సొంత రాష్ట్రాన్ని పట్టుకొని పక్క రాష్ట్రం అన్నావంటే..నీకు రాష్ట్రం పై ఏమాత్రం ప్రేమ లేదని,ఇళ్లు కట్టుకొని హైదరాబాద్ లో స్థిరపడ్డారని విమర్శిస్తున్నారు.

పన్నులు తెలంగాణలోనే కడుతున్నారు...మూడు రాజధానులకు మద్దతు పలికావు..నీ తమ్ముడు పవన్ కల్యాణ్ పై రాజకీయ దాడులు జరుగుతుంటే అడ్డుకోలేదని గుర్తు చేసిన నెటిజెన్లు...రేవంత్ రెడ్డి ముందు చంద్రబాబును చులకన చేసి మాట్లాడావని దాన్ని జీర్ణించుకోలేకున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. ఎవరైనా అలా మాట్లాడతారా? రాజకీయ దురంధరుడైన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డులను చూసి స్పూర్తి తెచ్చుకోవాలా? విడిపోయిన రాష్ట్రానికి సినీ ప్రముఖులెవరైనా మద్దతు పలికారా? అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మిమ్మల్ని చూసిన తర్వాత చేయరు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమా టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకుంటున్నారుకానీ ఒక్కరు కూడా వచ్చి చంద్రబాబును,పవన్ కల్యాణ్ ను కలవలేదని చెబుతున్నారు.కానీ వారు మానవత్వంతో టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.వాస్తవానికి సినీ పరిశ్రమకు ఏం చేయాలనే విషయమై కూటమి ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక ఉంది.కానీ మీలాంటి హీరోలను,దర్శకులను,నిర్మాతలను చూసినతర్వాత వారికి కూడా ఏమీ చేయాలనిపించడంలేదని అర్థమవుతోందని చెప్పుకొస్తున్నారు.ప్రజలు కూడా మీకు మద్దతుగా నిలవడం లేదని చెప్పిన నెటిజెన్లు...మీకు ఎక్కువగా ఆదాయం వచ్చేదే ఏపీ నుంచని అటువంటి ఏపీని పక్క రాష్ట్రం అన్న తర్వాత ఈ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు,పరిశ్రమ పెద్దలకు గౌరవం ఉండదని బాహాటంగానే స్పష్టం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేస్తున్నాయి. అయితే చిరంజీవి కామెంట్స్‌తో కదిలిన ప్రభుత్వం త్వరలోనే ఏపీలో కూడా అవార్డులను ప్రకటిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications