ఇండియాలో నెం.1గా చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’ గ్లింప్స్ ఆల్‌టైమ్ రికార్డ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద వేటాడటానికి ముందే సోషల్ మీడియా వేదికగా రికార్డుల వేట మొదలుపెట్టింది. తారక్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లూ అభిమానులు 'ఎన్టీఆర్-నీల్' ప్రాజెక్ట్ అని పిలుచుకున్న ఈ చిత్రానికి అధికారికంగా 'డ్రాగన్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అంటే కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది, కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా 4 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఒక భారీ ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
64 మిలియన్ల వ్యూస్
ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. భారతదేశంలో ఏ సినిమా గ్లింప్స్‌కు కూడా ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. దీంతో 'ఇండియాస్ హయ్యెస్ట్ వ్యూడ్ గ్లింప్స్'గా డ్రాగన్ ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 1967 నాటి చీకటి సామ్రాజ్యం
ఈ గ్లింప్స్ ద్వారా ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ డార్క్, ఇంటెన్స్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. 1967 కాలంలో అంతర్జాతీయంగా సాగిన అక్రమ ఓపియం (నల్లమందు) వ్యాపారం, 'గోల్డెన్ ట్రైయాంగిల్' (మయన్మార్, లావోస్, థాయిలాండ్), అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య నడిచే నెత్తుటి యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగనుంది.

సరికొత్త బెంచ్ మార్క్ ఖాయం
ఇందులో ఎన్టీఆర్ 'లూగర్' అనే అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ ప్రధాన హంతకుడి పాత్రలో కనిపించబోతున్నారు. శవాల గుట్ట మధ్యలో సిక్స్‌ప్యాక్ అబ్స్‌తో, మునుపెన్నడూ చూడని అత్యంత క్రూరమైన యాంటీ-హీరో లుక్‌లో తారక్ కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించారు. "దేవుడు నాకో వరమిచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం.. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు" అంటూ ఎన్టీఆర్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే తీసుకున్న అత్యంత కఠినమైన, అత్యంత రిస్క్‌తో కూడిన నిర్ణయాలలో ఈ పాత్ర ఒకటని, ఆయన పోషిస్తున్న పాత్రల్లోనే ఇది అత్యంత డార్క్ క్యారెక్టర్ అని పేర్కొన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా పీరియడ్ డ్రామా ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదల కానుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో విడుదల చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం సాధించిన ఈ రికార్డు కేవలం ఆరంభం మాత్రమేనని, థియేటర్లలో రాబోయే సునామీకి ఇది ముందస్తు సంకేతమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. విజువల్స్ పరంగా, మాస్ ఎలిమెంట్స్ పరంగా 'డ్రాగన్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది!












Click it and Unblock the Notifications