తనతో గడపాలంటూ హీరో ధనుష్ వేధించారు.. బయటపెట్టిన హీరోయిన్
తమిళ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ధనుష్ తెలుగులో కూడా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా 'రఘువరన్ బీటెక్' సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ధనుష్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతోంది. అతను నటనకు జాతీయ అవార్డు దక్కింది. ధనుష్ ఏ సినిమా చేసినా , అది తెలుగులో విడుదల కావాల్సిందే.
'సర్', 'తిరు', 'కుబేర' వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు ధనుష్. అయితే ధనుష్ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ధనుష్ తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ధనుష్ పలువురి హీరోయిన్లతో ఎఫైర్ కూడా సాగించినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అమలాపాల్‌తో ధనుష్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. సింగర్ సుచిత్ర సైతం ధనుష్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ఇదిలా తాజాగా ధనుష్ మరో వివాదంలో చిక్కుకున్నారు.

ధనుష్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ నటి బయటకొచ్చింది. తమిళంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది మాన్యా ఆనంద్.వనతై పోల, సూర్యవంశం వంటి సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా ఆమె హీరో ధనుష్ లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ధనుష్ వండర్‌బార్ ప్రొడక్షన్స్ హౌస్ నుంచి శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశారని, అయితే ఈ అవకాశం దక్కించుకోవాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని తెలిపింది. నేను సైలెంట్‌గా ఉండటంతో .. ధనుష్ సార్ కోసమైనా ఒప్పుకోవా అంటూ కాస్టింగ్ కౌచ్ డిమాండ్ చేశాడని ఆమె వెల్లడించింది. స్క్రిప్ట్, వండర్‌బార్ ఆఫీస్ లొకేషన్ పంపించి అక్కడకు రావాలని ఒత్తిడి చేశాడని.. దీంతో అతన్ని బ్లాక్ చేశానని చెప్పుకొచ్చింది.
అయితే నటి మాన్యా ఆనంద్ చేసిన ఆరోపణలను ధనుష్ టీం కొట్టిపారేసింది. ఎవరో కావాలనే ఇదింతా చేస్తున్నారని ధనుష్ టీం తెలిపింది. ధనుష్ మేనేజర్ శ్రేయస్ శ్రీనివాసన్ పేరు, ఫొటో ఉపయోగించుకుని ఎవరో అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.. ఇలాంటి ఫిర్యాదులు ఇంతకు ముందు కూడా వచ్చాయిని, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు.ఇందులో ధనుష్‌కు ఎలాంటి సంబంధం లేదని ఓ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications