స్టార్ బ్యూటీ "రుక్మిణీ వసంత్" ప్రైవేట్ ఫోటో లీక్.. ఆ నటుడితో !!
"రుక్మిణీ వసంత్".. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అలానే "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి పెద్దగా విజయం పొందలేకపోయాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి", రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫోటో లీక్..
ఈ స్టార్ బ్యూటీకి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023లో స్వయంగా ఆ ఫోటోని రుక్మిణి వసంత్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కాగా ఆ ఫోటోలో ఉన్నది స్నేహితుడు సిద్ధాంత్ నాగ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రుక్మిణికి వరుస అవకాశాలు రావడంతో ఆమె బిజీ అయ్యారు. సిద్ధాంత్ నాగ్ మాత్రం నటుడిగా ఇంకా బ్రేక్ అందుకోలేకపోయాడు. మరీ ఈ ఫోటోపై నటి ఏ విధంగా రెస్పాండ్ అవుతోందో చూడాలి.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. అలానే ఈ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారని టాక్.













Click it and Unblock the Notifications