టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా: గ్లింప్సెస్ గూస్ బంప్స్
హనుమాన్ చిత్రంతో టాలీవుడ్ లో నూతన ఒరవడి సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తోన్నారు. అదే సమయంలో మరో సినిమాను కూడా ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై ఆయన పర్యవేక్షణలో రాబోతోందీ భారీ పౌరాణిక చిత్రం. ఈ మూవీ టైటిల్.. మహాకాళి. కొద్దిసేపటి కిందటే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్సెస్ విడుదల అయ్యాయి. ఓ వీడియోను ప్రశాంత్ వర్మ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
"ఆగస్ట్ 2024- ది ఎండ్ బిగిన్స్" అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రకటించారు. శుక్రాచార్యా వార్ క్రై పేరుతో విడుదలైన ఈ వీడియో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్ర పోషిస్తోన్నారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తోన్నారు. ఛావాలో ఔరంగజేబ్, ధురంధర్ లో రెహ్మాన్ డకైట్, బోర్డర్ 2లో లెప్టినెంట్ ధరంవీర్ భక్రి, ఇక్కాలో శౌర్యమాన్ గౌర్ పాత్రలతో దేశవ్యాప్తంగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆయన పోషించిన ఈ క్యారెక్టర్లు లేకపోతే సినిమానే లేదనే రేంజ్ లో గుర్తింపు వచ్చిందాయనకు.

ఇప్పుడు మహాకాళిలో నటిస్తోన్నారు. శుక్రాచార్యుడిగా కీలక పాత్రను పోషిస్తోన్నారు. పురాణాల ప్రకారం అసురుల గురువు శుక్రాచార్యుడు. ఈ క్యారెక్టర్ చుట్టే మహాకాళి కథ తిరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గుర్తు పట్టని విధంగా తనను తాను మలచుకున్నారు. ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోందీ మహాకాళి ఫిల్మ్.
ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దీనికి మూలకథను అందిస్తోన్నారు. సినిమాటిక్ విశ్వాన్ని క్రమంగా విస్తరిస్తోన్నారు. ఆర్ కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కబోతోంది. రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్ సినిమాను నిర్మిస్తున్నారు. హనుమాన్ తరహాలోనే సరికొత్త సాంకేతికత, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది.
పెద్దమ్మ చూస్తుంది రా! 🙏🏽#Mahakali #Sankranthi2027 pic.twitter.com/5CbAPhXhS4
— Prasanth Varma (@PrasanthVarma) August 24, 2026
ఈ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. 2027 జనవరి 8వ తేదీన న సంక్రాంతి పండుగ కానుకగా మహాకాళి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫిల్మ్ లో భూమి షెట్టి, రోహిత్ ష్రాఫ్, శ్రియా రెడ్డి, సముద్రఖని, నాజర్, రజత్ కపూర్, రాకేశ్ బేడీ, మురళీ శర్మ, పృథ్వీరాజ్ తదితర నటులు కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.














Click it and Unblock the Notifications