స్టార్ హీరోయిన్ పై లైంగిక దాడి: మలయాళ సూపర్ స్టార్ పై కోర్టు తుది తీర్పు
ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కేసులో మరో ఆరుమందిని దోషులుగా తేలారు. ఈ లైంగిక దాడి కేసులో వీరితో పాటు మరో 10ని దోషులుగా నిర్ధారించింది. ఈ మేరకు ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ అండ్ ప్రధాన సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ హనీ ఎం వర్ఘీస్ కొద్దిసేపటి కిందటే తీర్పు ఇచ్చారు.
2017 నాటి కేసు ఇది. ఓ ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. 2017 ఫిబ్రవరి 17న కోచిలో ఆ నటిని ఆమె కారులోనే అపహరించారు. రాత్రివేళ సిటీ మొత్తం కారులో తిప్పుతూ దాదాపు రెండు గంటల పాటు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వెనుక దిలీప్ ప్రమేయం ఉందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. మనస్పర్థల కారణంగా ఆమెపై లైంగిక దాడి చేయించాడంటూ వార్తలొచ్చాయి.

ఆయనపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. దిలీప్ అరెస్ట్ కూడా అయ్యారు అప్పట్లో. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ కేసులో దిలీప్ ఏ8గా ఉన్నారు. తాజాగా ఆయనపై ఉన్న కేసును ఎర్నాకుళం కోర్టు కొట్టివేసింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఈ కేసు పల్సర్ సుని, మార్టిన్ ఆంటోని, మణికందన్ బీ, విజేష్ వీపీ, సలీం హెచ్, ప్రదీప్, ఛార్లీ థామస్, సానిల్ కుమార్, మేస్త్రి సానిల్, శరత్‌తో సహా పది మంది నిందితులు ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.
వీరందరిపైనా నేరపూరిత కుట్ర, కిడ్నాప్, లైంగిక దాడి, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి అనేక సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ నిబంధనల కేసులు నమోదయ్యాయి. సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు దిలీప్‌పై అదనంగా మరో కేసు కూడా ఫైల్ అయింది. ఏప్రిల్ 2017లో మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు పల్సర్ సుని జైలు నుండి దిలీప్‌కు లేఖ పంపినట్లు దర్యాప్తుదారులు ఆరోపించిన తర్వాత అదే సంవత్సరం జూలైలో ఆయనను అరెస్టు చేశారు.
అనంతరం అక్టోబర్ 2017లో ఆయనకు బెయిల్ మంజూరైంది. తరువాత 2017లో ఒక అనుబంధ ఛార్జిషీట్ దాఖలైంది. ఈ లైంగిక దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు దిలీప్ వద్ద ఉన్నాయని 2021లో నిర్మాత బాలచంద్ర కుమార్ ఆరోపించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 2022లో కోర్టు కస్టడీలోని మెమరీ కార్డును అక్రమంగా యాక్సెస్ చేశారనే ఆరోపణలు రావడంతో హైకోర్టు నిజనిజాలను నిర్ధారించడానికి లైంగిక సంబంధిత సాక్ష్యాలను పర్యవేక్షించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
విచారణ సమయంలో మొత్తం 261 మంది సాక్షులను పరిశీలించారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, చాలామంది కోర్టులో తమ వాంగ్మూలాలను ఇచ్చారు. దర్యాప్తు అధికారిని 109 రోజుల పాటు విచారించారు కూడా. కోర్టు 834 డాక్యుమెంట్లను ఆమోదించడంతో పాటు ఇద్దరు డిఫెన్స్ సాక్షులను వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. మాజీ ఎమ్మెల్యే పీటీ థామస్, బాలచంద్ర కుమార్ విచారణ సమయంలో మరణించారు.












Click it and Unblock the Notifications