మంగమ్మగారి మనవడు, ఖైదీ.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన మంగమ్మగారి మనవడు, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన ఖైదీ.. ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లే. ఇటువంటి సినిమాలు మళ్లీ రావు. బాక్సాఫీస్ వద్ద ఒకరకంగా ఈ రెండు సినిమాలు మారణహోమం సృష్టించాయని చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ సినిమా? ఏది ఎక్కువ రోజులు ఆడింది? ఏ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయంటూ చర్చపెట్టారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది..

1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవిని అగ్ర హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. అప్పటివరకు ఉన్న కమర్షియల్ ఫార్ములాను మారుస్తూ వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. చిరంజీవిని సుప్రీంహీరోగా మార్చింది. సూపర్ స్టార్ కృష్ణ షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో కథ చిరంజీవి దగ్గరకు వచ్చింది. అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 30కి పైగా కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఆ కాలంలో ఖైదీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ బ్యానరుపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు.

mangammagars-grandson-khaidi-which-of-these-two-industry-hits-is-the-best

(mangamma gari grandson ) బాక్సాఫీస్ దగ్గర మారణహోమం..

1984లో వచ్చిన మంగమ్మగారి మనవడు ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మారణహోమం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిందూపూర్ లో ఒకే థియేటర్లో 567 రోజులు ఆడి అప్పట్లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. అలాగే చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు.

అప్పట్లో ఒక సినిమా ఏడాదికి పైగా ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. మాస్ ఆడియన్స్ తోపాటు కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించింది మంగమ్మగారి మనవడు. ఎక్కువ రోజులు ఆడటం, వసూళ్ల నిలకడను బట్టి చూస్తే, 'మంగమ్మగారి మనవడు' ఖైదీ మీద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ఎందుకంటే 500 రోజులకు పైగా సినిమా ఆడటం అనేది అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది కాబట్టి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+