నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న 6 సిరీస్‌లు ఇవే

ఓటీటీ స్క్రీన్‌లపై సరికొత్త వినోదాల జాతర మొదలైంది. రొటీన్ కథలకు భిన్నంగా మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్, కళ్లు తిప్పుకోనివ్వని యాక్షన్, గుండెలను పిండేసే ఎమోషన్స్‌తో కూడిన 6 క్రేజీ వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. వీకెండ్‌లో బోర్ కొట్టకుండా, బ్యాక్-టు-బ్యాక్ చూసేయడానికి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

1. బ్రిడ్జర్టన్: సీజన్ 4 (రాజ వంశపు ప్రేమాయణం)

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మనసులు గెలుచుకున్న ఈ పీరియడ్ డ్రామా, ఇప్పుడు నాలుగో సీజన్‌తో మరింత రొమాంటిక్‌గా ముస్తాబై వచ్చింది. ఈసారి కథ బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్, సోఫీ బేక్ ల చుట్టూ తిరుగుతుంది. ఒక ముసుగుల పండుగ లో వెండి రంగు దుస్తుల్లో మెరిసిన ఓ అపరిచిత యువతి ప్రేమలో పడతాడు బెనెడిక్ట్. కట్ చేస్తే.. ఆమె అతడి ఇంట్లోనే పనిమనిషిగా మారుతుంది. అంతస్తుల అంతరాలు, సమాజం పెట్టే రూల్స్ మధ్య వీరి ప్రేమ కథ ఎలా సాగిందనేదే ఈ సీజన్ హైలైట్.

ఓటీటీలో సెన్సేషన్‌గా
ఓటీటీలో సెన్సేషన్‌గా
Netflix 6 Must-Watch Series That Are Taking the World by Storm

2. టీచ్ యూ ఏ లెసన్ (సరికొత్త రివెంజ్ డ్రామా)

దక్షిణ కొరియా విద్యా వ్యవస్థలోని చీకటి కోణాలను, క్లాస్‌రూమ్‌లలో జరిగే వేధింపులను ఎండగడుతూ సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ఇది. వివాదాస్పద వెబ్‌టూన్ 'గెట్ స్కూల్డ్' ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వ్యవస్థలోని తప్పులను ఒక రేంజ్‌లో కడిగిపారేసే పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో, యాక్షన్ ప్రియులను ఈ కొరియన్ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

3. హిస్ & హర్స్ (థ్రిల్లర్)

సస్పెన్స్ కథలను ఇష్టపడేవారికి ఇది గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. ఒక మాజీ న్యూస్ యాంకర్, తన సొంత ఊరిలో జరిగిన ఒక దారుణమైన హత్య కేసును వ్యక్తిగతంగా దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఆ కేసును విచారించే ఆఫీసర్ మరెవరో కాదు, ఆమె మాజీ భర్తే. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లేకొద్దీ వారిద్దరి గతంలోని చేదు నిజాలు, నమ్మలేని రహస్యాలు బయటపడతాయి. ప్రతి ఎపిసోడ్ ఊపిరి బిగబట్టేలా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.

ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ..
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ..

4. వన్ పీస్: సీజన్ 2 (సముద్రపు లూటీల నయా ప్రపంచం)

గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'వన్ పీస్' లైవ్ యాక్షన్ సిరీస్, ఇప్పుడు మరింత గ్రాండ్‌గా రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంకీ డి లఫీ అండ్ గ్యాంగ్ ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ఏరియా అయిన 'గ్రాండ్ లైన్' లోకి ఎంటర్ అవుతారు. ఈ సీజన్ క్లైమాక్స్‌లో వచ్చే నయా విలన్ 'సర్ క్రొకడైల్' ఎంట్రీ, నెక్స్ట్ సీజన్‌కు అదిరిపోయే పునాది వేయనుంది. ఫాంటసీ, యాక్షన్ లవర్స్ దీన్ని అస్సలు మిస్ అవ్వలేరు.

5. ది వండర్‌ఫూల్స్ (సామాన్యుల 'సూపర్' పవర్స్)

ఇది 1990ల చివరి కాలంలో సాగే ఒక వినూత్నమైన కథ. అప్పటివరకు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసే కొందరు కుర్రాళ్లకు అనుకోకుండా ఊహించని సూపర్ పవర్స్ వస్తాయి. అదే సమయంలో ప్రపంచం అంతరించిపోబోతుందనే ఒక వింత భయం అందరినీ వెంటాడుతుంది. కామెడీ, ఫాంటసీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సిరీస్ సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తుంది.

6. బీఫ్: సీజన్ 2 (ఇగోల మధ్య సాగే డేంజర్ గేమ్)

మొదటి సీజన్‌తో ఎమ్మీ అవార్డులను కొల్లగొట్టిన 'బీఫ్'.. ఇప్పుడు రెండో సీజన్‌తో అంతకుమించిన హైప్‌తో వచ్చింది. వేర్వేరు వర్గాలకు చెందిన రెండు జంటల జీవితాలు ఒక లగ్జరీ క్లబ్‌లో జరిగిన మిస్టరీ సంఘటనతో ముడిపడతాయి. అధికారం, అహంకారం, ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే క్రమంలో వారు ఒక ప్రమాదకరమైన వలయంలో చిక్కుకుంటారు. హ్యూమర్ తో పాటు పీక్ లెవెల్ సస్పెన్స్ ఈ సిరీస్ సొంతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+