తెలుగులో మొదటి పాన్ ఇండియా సినిమా ఏదో తెలుసా? ‘బాహుబలి’ కాదు!
ప్రస్తుతం మనం వింటున్న 'పాన్ ఇండియా' అనే పదం, ఆ ట్రెండ్ 'బాహుబలి' సినిమాతోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే, టెక్నాలజీ, మార్కెటింగ్ లేని ఆ కాలంలోనే.. భారతదేశం అంతటా ఒకేసారి విడుదలై సంచలనం సృష్టించిన మొదటి తెలుగు పాన్ ఇండియా సినిమా 1951లోనే విడుదలైన 'పాతాళ భైరవి'. లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు (NTR) హీరోగా, కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన జానపద బ్రహ్మాండం 'పాతాళ భైరవి'. ఇది మొదటిసారిగా అధికారికంగా తమిళం, హిందీ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేశారు. 1952లో హిందీలో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక..
భారతదేశంలో జరిగిన మొదటి 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' లో ప్రదర్శితమైన ఏకైక దక్షిణ భారతీయ సినిమా పాతాళ భైరవి కావడం విశేషం. ఆ కాలంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. అందుకే ఎన్టీఆర్ ను తెలుగు సినిమాకు సంబంధించి 'మొదటి పాన్ ఇండియా స్టార్' అని పిలుస్తారు. 1953లో భానుమతి స్వీయ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా నటించిన 'చండీరాణి' సినిమాను ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చేసుకొని ఏకకాలంలో విడుదల చేశారు.

1963లో 'లవకుశ'
1963లో విడుదలైన 'లవకుశ' చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై అఖండ విజయం సాధించింది. 1977లో విడుదలైన అడవిరాముడు సినిమా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ భారీ వసూళ్లు సాధించింది. అయితే, పైన చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తయితే.. 'పాన్ ఇండియా' అనే పదాన్ని ఒక బ్రాండ్‌గా మార్చి, సరిహద్దులను చెరిపేసి, హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు దాటిన మొదటి డబ్బింగ్ సినిమాగా నిలిచింది మాత్రం ఎస్.ఎస్. రాజమౌళి "బాహుబలి: ది బిగినింగ్" (2015). ఆ తర్వాతే మిగతా భాషల పరిశ్రమలు కూడా ఈ ఫార్ములాను అందుకోవడం ప్రారంభించాయి.













Click it and Unblock the Notifications