రికార్డుల గురించి మాట్లాడాలంటే ప్రభాస్ గురించే మాట్లాడాలి
ఒక్క తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ వస్తే ప్రభాస్ పేరు ప్రస్తావించకుండా ఆ చర్చ పూర్తి కాదు. ఇండియన్ సినిమా మార్కెట్‌ను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని రెండుగా విభజించే స్థాయికి ఆయన ఎదిగారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ ప్రభాస్ ఆ సరిహద్దులను చెరిపివేశారు. 'బాహుబలి' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కంటెంట్‌తో సంబంధం లేకుండా కేవలం ఆయన 'స్టార్ పవర్'తోనే వందల కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. హిందీ మార్కెట్లో ఒక దక్షిణాది హీరో నేరుగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఖాన్ త్రయం రికార్డులను సవాల్ చేయడం ప్రభాస్‌తోనే మొదలైంది.
వెయ్యి కోట్ల క్లబ్లో ఏకైక రారాజు
భారతీయ చలనచిత్ర చరిత్రలో రెండు వేర్వేరు చిత్రాలతో వెయ్యి కోట్ల మార్కును (బాహుబలి 2, కల్కి 2898 AD) దాటిన ఏకైక తెలుగు హీరో ప్రభాస్. ఇది ఆయన గ్లోబల్ మార్కెట్ స్టామినాకు నిదర్శనం. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా (ఉదాహరణకు 'సాహో', 'ఆదిపురుష్'), కేవలం ఆయన కటౌట్ చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఉండటం వల్ల ఆ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లను రాబట్టగలిగాయి. ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.230 కోట్లు వసూలు చేసిందంటే ప్రభాస్ క్రేజ్, ఇమేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదివారు కూడా ప్రభాస్ ను తమ సొంతం చేసుకున్నారు.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్..
కేవలం మాస్ మసాలా చిత్రాలకే పరిమితం కాకుండా, విభిన్నమైన జోనర్లను టచ్ చేయడం ప్రభాస్ ప్రత్యేకత. 'సలార్'తో పూర్తిస్థాయి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తే, 'కల్కి 2898 AD'తో సైన్స్ ఫిక్షన్, పురాణాల మేళవింపును ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటున్నాయి. భారతదేశంలోని అగ్ర దర్శకులు ఎవరైనా సరే, తమ భారీ బడ్జెట్ కలలను సాకారం చేసుకోవడానికి చూస్తున్న మొదటి పేరు ప్రభాస్.
రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలను హ్యాండిల్ చేయగల ధీమాను నిర్మాతలకు, బయ్యర్లకు ఆయన ఇస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉన్న సినిమాలకు ప్రభాస్ ఒక గ్లోబల్ ఫేస్‌గా మారిపోయారు. రాబోయే 'స్పిరిట్', 'సలార్ 2', ఫౌజీ, కల్కి2 వంటి చిత్రాలతో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రికార్డులు తమ హీరో వెనుక పరిగెత్తడంలేదని, ప్రభాస్ వేసే ప్రతి అడుగు ఒక కొత్త రికార్డును సృష్టిస్తోందని డార్లింగ్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications