రాజు నిజంగా మహరాజేరా.. రూ.వందల కోట్లతో రాజభవనం కడుతున్నాడుగా!
బాహుబలి సిరీస్‌తో భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసించిన పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. బాక్సాఫీస్ వద్ద పరాజయాలు ఎదురైనా సరే, ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోగా పాన్ ఇండియా స్థాయిలో మరింత బలపడుతోంది. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, తాజాగా విడుదలైన దేశీయ టాప్ 10 హీరోల జాబితాలో ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకొని తన తిరుగులేని పాపులారిటీని మరోసారి నిరూపించుకున్నారు. 4 సంవత్సరాలుగా ఆయనే నెం.1 హీరోగా కొనసాగుతుండటం విశేషం.
హైదరాబాద్ ఐటీ హబ్‌లో 'రెబల్ స్టార్' సరికొత్త ప్యాలెస్
ప్రస్తుతం ప్రభాస్ జూబ్లీహిల్స్‌లోని తన పాత నివాసంలో ఉంటున్నారు. అలాగే షూటింగ్స్ నిమిత్తం ముంబైలో ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఇవి కాకుండా స్నేహితులు, తోటి నటీనటులతో చిల్ అవ్వడానికి రాయదుర్గంలో ఆయనకు ఒక లగ్జరీ గెస్ట్ హౌస్ కూడా ఉంది. అయితే, తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక అల్ట్రా మోడ్రన్ హోమ్‌ను నిర్మించుకోవాలనేది ప్రభాస్ కు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన, హై-ప్రొఫైల్ ఏరియాగా వెలుగొందుతున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాన్ని అందుకు డార్లింగ్ ఎంచుకున్నారు.

రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో స్మార్ట్ హోమ్
కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభాస్ ఈ ఐటీ హబ్ పరిధిలో దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లోనే అక్కడ ఎకరం భూమి ధర సుమారు రూ.80 కోట్లు పలుకగా, కేవలం స్థలం కోసమే ఆయన రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడు స్థలం రిజిస్ట్రేషన్‌తో పాటు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పూర్తి కావడంతో, దాదాపు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిర్మాణ వ్యయంతో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. స్థలం, నిర్మాణం అన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ విలువ రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ప్రయాణానికి అత్యంత అనుకూలమైన వేదిక
ప్రభాస్ ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీనికున్న భౌగోళిక ప్రాధాన్యత. ఈ ల్యాండ్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు చాలా సమీపంలో ఉంటుంది. దీనివల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చాలా తక్కువ సమయంలో సులభంగా చేరుకోవచ్చు. రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఇంట్లో అంతర్జాతీయ స్థాయి హంగులను జోడిస్తున్నారు. ఇల్లంతా రోబోటిక్, ఆటోమేషన్ సిస్టమ్‌తో కూడిన 'స్మార్ట్ హోమ్'గా ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మోడ్రన్ జిమ్, అధునాతన ప్రైవేట్ హోమ్ థియేటర్, అల్ట్రా లగ్జరీ స్విమ్మింగ్ పూల్, ప్రశాంతతను పంచే విశాలమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, విదేశీ నిపుణులతో డిజైన్ చేయించబోయే అద్భుతమైన ఇంటీరియర్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండటంతో డార్లింగ్ అభిమానులు మురిసిపోతున్నారు.












Click it and Unblock the Notifications