Ramcharan : 'పెద్ది' ఓటీటీ భారీ డీల్.. రామ్ చరణ్ బిగ్గెస్ట్ రికార్డ్!
గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలు, హిందీ హక్కుల కోసం ఏకంగా రూ.130 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే ఒక సినిమాకు ఈ స్థాయి ధర పలకడం చెర్రీ మార్కెట్ స్టామినాను తెలియజేస్తోంది. ఈ డీల్‌లో నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన నిబంధనను పెట్టింది.
ఒకవేళ 'పెద్ది' చిత్రం థియేటర్లలో భారీ విజయం సాధించి, అంచనాలను అందుకుంటే నిర్మాతలకు అదనంగా మరో రూ.20 కోట్లు బోనస్‌గా అందిస్తానని చెప్పింది. అంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే, మొత్తం ఒప్పందం రూ.150 కోట్లకు చేరుతుంది. ఇది టాలీవుడ్ సినిమా చరిత్రలో అతి పెద్ద డీల్స్ లో ఒకటిగా నిలవనుంది.

బాలీవుడ్ భామతో ఆటపాటలు
ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి కారణం క్రేజీ కాంబినేషనే. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన చరణ్ పహిల్వాన్ లుక్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పాత్ర కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకోవడం విశేషం. మరోవైపు ఈ చిత్రంలో ఆయన ఒక క్రికెటర్‌గా కూడా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా గతంలో విడుదలయ్యాయి.
రామ్ చరణ్ రోజురోజుకూ మెరుగవుతున్నాడు
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 30న వెండితెరపై సందడి చేయనుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం కుదిరింది. 'పెద్ది' విజయం తర్వాత రామ్ చరణ్ మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఏదేశమైనప్పటికీ సుకుమార్, అతని శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలు చేయడంద్వారా నటనలో కూడా చరణ్ రోజురోజుకూ మెరుగవుతున్నారని చెప్పొచ్చు.
ప్రస్తుతం మన తెలుగులో ఉన్న యువహీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే నవరసాలు పోషించగలడని పేరు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటివారు కూడా హావభావాలు పలికించడంలో రోజురోజుకూ రాటుతేలడంతోపాటు విభిన్నమైన పాత్రలు, ఆహార్యంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నారు. వీరిల్లో ఒక్క మహేష్ బాబే తన ఆహార్యాన్ని మార్చుకోకుండా సినిమాలు చేస్తున్నారు. అతని అభిమానులకు మాత్రం ఇది నిరాశ పరిచే విషయమే.












Click it and Unblock the Notifications