మెగాస్టార్ చిరంజీవికి ఏమైంది.. ఎక్కడున్నారు ? ఆందోళనలో ఫ్యాన్స్..??
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరికొద్ది రోజుల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఆయన నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు' మూవీ రిలీజ్ కానుంది. అలానే వచ్చే ఏడాది వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఆలానే 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఆ మూవీ రాబోతుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. వీటితో పాటే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఒక మూవీకి కమిట్ అయ్యారు.
అయితే ఫుల్ ఫామ్ లో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు సైలెంట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానే చిరంజీవి సినిమాల విషయంలో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. తన సినిమాలతో పాటు వేరే సినిమాల విషయాలను కూడా అప్పుడప్పుడు లీక్ చేసేస్తూ ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా అక్కడ విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు.

కానీ ఇప్పుడు అనూహ్యంగా 12వ తేదీన మూవీ రిలీజ్ పెట్టుకొని ఒక్క ప్రమోషన్ లో కూడా ఆయన పాల్గొనకపోవడం పట్ల మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా చిరంజీవి తన సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, మీడియా ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొంటారు. కానీ ఈసారి ఆయన 'ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు?' అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో మెగాస్టార్ కి ఏమైంది ? ఎక్కడ ఉన్నారు అంటూ జోరుగా చర్చ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు తెర లేపింది.
ప్రమోషన్స్ లో కనిపించని మెగాస్టార్..
కాగా 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తుండగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా భారీ హిట్ అందుకుంది. దాంతో ఈ మూవీపై అనౌన్స్ మెంట్ నాటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ప్రచార వీడియోలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. అనిల్ మార్క్ కామెడీ, మెగాస్టార్ చిరంజీవి టైమింగ్ అద్భుతంగా కుదిరాయని అంటున్నారు. వీటికి తోడు నయనతార క్రేజ్, వెంకటేష్ గెస్ట్ రోల్ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే అనిల్ తన సినిమాలకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్, పోస్టర్స్ విషయంలో తనదైన శైలిలో ఆసక్తి కలిగిస్తూ అనిల్ ప్రమోషన్స్ అదరగొడితే.. ఇప్పుడు వరుసగా ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వరుస కార్యక్రమాల్లో చిరు పాల్గొనకపోవడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు.
All set for a grand evening of celebrations and entertainment❤️🔥#ManaShankaraVaraPrasadGaru MEGA VICTORY PRE RELEASE EVENT TODAY from 5:30PM onwards at SHILPAKALA VEDIKA, Hyderabad 💥
— Shine Screens (@Shine_Screens) January 7, 2026
— https://t.co/AWG1DtNksz #MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026.… pic.twitter.com/dZsdpgADPF
కారణం అదే..
సినీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఆయనకు, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వైద్యుల సలహా మేరకు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉన్నారని.. శారీరక శ్రమ చేయవద్దని సలహా ఇవ్వడంతోనే ప్రమోషన్ల బాధ్యతను దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications