అప్పుడు గుర్తు లేదా.. అనసూయ, చిన్మయి లపై శేఖర్ భాషా ఫైర్..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు శివాజీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. "దండోరా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆ కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ రియాక్ట్ అవ్వడం.. మహిళా కమిషన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు పెరగడంతో శివాజీ క్షమాపణ చెప్పినా కూడా వివాదం మాత్రం సర్దుమనగడం లేదు. ఒక వర్గం శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతుంటే.. మరో వర్గం మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ విషయం లోకి బిగ్‌బాస్ ఫేమ్, సినీ నటుడు ఆర్జే శేఖర్ బాషా ఎంటర్ అయ్యారు. గతంలో నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో అతనికి అండగా నిలిచి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి శివాజీకి సపోర్ట్ గా ఉంటూ.. వాటిని కావాలనే వక్రీకరించి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా అనసూయ, చిన్మయిలపై నిప్పులు చెరిగారు. దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత బ్లాస్టింగ్ ఇష్యూ లాగా మారింది.

shekhar-basha-comments-on-anasuya-and-chinmayi-about-sivaji-issue

ఏమన్నారంటే..?

చిన్మయి, అనసూయ గతంలో ఇండస్ట్రీలో పెద్దలు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా హక్కులపై మాట్లాడే నైతిక హక్కు నిజంగా వారిద్దరికీ ఉందా అని నిలదీశారు. వీళ్లు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అంటూ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన లైవ్ చర్చలో వ్యాఖ్యానించారు. అనసూయ 'జబర్దస్త్' షోలో పలుమార్లు ద్వంద్వార్థాలు, బూతు పదాలు ఉపయోగించిందని గుర్తుచేశారు. ఇవి చేసినప్పుడు తప్పు కాదు, ఇప్పుడు మాత్రం నీతులు చెప్పాలా? అంటూ ఘాటు విమర్శలు చేశారు.

బూతు పాట తప్పు కాదా..!

కాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శేఖర్ బాషా, చిన్మయి గతంలో పాడిన పాటల విషయాన్ని కూడా లేవనెత్తారు. ప్రత్యేకంగా 'రోబో' సినిమాలోని 'కిల్లిమంజారో' పాటలోని కొన్ని లైన్లు ఉదాహరణగా చెప్పారు. అప్పుడు అవి అసభ్యంగా అనిపించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలున్నప్పుడు ఇతరులను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను మంచి ఉద్దేశంతో చెప్పినవిగా అభివర్ణించారు. ఇక ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం జోరుగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+