థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా 70MM 6-ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో వచ్చిన తొలి సంచలన చిత్రం 'సింహాసనం'. దీన్ని భుజాన వేసుకొని, భారీగా ఖర్చుచేసి, ప్రేక్షకులకు మరపురాని అనుభూతి అందించిన ఏకైక సూపర్ స్టార్ కృష్ణ. ఈ స్థాయి సాంకేతికతను తట్టుకునే థియేటర్లు అప్పట్లో ఆంధ్రాలో లేవు. కానీ, కృష్ణ పట్టుబట్టి భారీగా ఖర్చు చేసి గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరు వంటి ప్రధాన కేంద్రాల్లోని థియేటర్ల స్క్రీన్లను, సౌండ్ సిస్టమ్‌ను స్వయంగా ఆధునికీకరించారు. ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నారు. సినిమా తీయడమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందివ్వాలని ఎంతో తపన పడ్డారు. అది నెరవేర్చి చూపించారు.

చేతిలో సినిమా టికెట్ ఉంటేనే అనుమతించేవారు

ఈ సినిమా క్రేజ్ అప్పట్లో ఏ స్థాయిలో ఉందంటే.. విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగుల భారీ కటౌట్, బెంజ్ సర్కిల్‌లో 75 అడుగుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆ కటౌట్లను చూడటానికే వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. రద్దీ ఎంతగా ఉండేందంటే.. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పోలీసులకు అసాధ్యంగా మారింది. దీంతో తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ఒక చిత్రం కోసం థియేటర్ల పరిసరాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. చేతిలో సినిమా టికెట్ ఉంటేనే ఆ వీధిలోకి అనుమతించే వారు. ఆ క్రేజ్ ను బట్టి 'సింహాసనం' సృష్టించిన సునామీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Simhasanam Section 144 has been imposed near theaters accompanied by police traffic diversions during release

కావాలనే మందాకినిని తీసుకున్నారు

ఈ చిత్రంలో అప్పటికే కృష్ణ-శ్రీదేవి హిట్ కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, కృష్ణ ఎప్పటిలానే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. హిందీలో 'రామ్ తేరీ గంగా మెయిలీ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మందాకినిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఫ్రెష్‌గా ఉంటుందనే ఉద్దేశంతో శ్రీదేవి స్థానంలో ఆమెను తీసుకున్నారు. జయప్రద, రాధ వంటి అగ్ర హీరోయిన్లతో పాటు, మహారాణి పాత్రలో వహీదా రెహమాన్ ఈ చిత్రానికి మరింత హుందాతనాన్ని తెచ్చారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణ సంగీత దర్శకుడిగా బప్పిలహరిని ఎంచుకున్నారు. హిందీలో జితేంద్రతో ఈ సినిమా నిర్మించారు. హీరోయిన్లు మాత్రం వారే ఉన్నారు.

50 లక్షలతో సినిమా తీయడం ఎక్కువ అనుకునే రోజుల్లో 4 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే సగం బడ్జెట్‌ను రాబట్టింది. పౌరాణిక, జానపద అంశాలను కలగలిపిన కృష్ణ మాయ 'సింహాసనం' గ్రాఫిక్స్ లేని ఆ కాలంలోనే ఒక విజువల్ వండర్‌గా నిలిచింది. పద్మాలయా స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు కళ్లముందు కదలాడుతుంటాయి. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+