సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్?

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ రేసులో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ప్రభాస్ రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు.. భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు అలరించనున్నాయి. వాటితో పాటు డబ్బింగ్ మూవీస్ లిస్టులో దళపతి విజయ్ "జన నాయగన్", శివ కార్తికేయన్ పరాశక్తి కూడా ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి బరిలో విజేతగా నిలిచేది ఎవరో అని జోరుగా చర్చ నడిచింది.

కాగా విజయ్ చివరి చిత్రంగా చెబుతున్న "జననాయగన్" జనవరి 9న.. శివ కార్తికేయన్ నటించిన 'పరాశక్తి' జనవరి 10న థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ విజయ్ సినిమా రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంకా కోర్టులో నడుస్తోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే తమిళనాడులో విజయ్ సినిమాకు ఇచ్చిన థియేటర్స్ ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్ కు కేటాయించేశారు.

siva-karthikeyan-parashakti-movie-out-from-sankranthi-race

అయితే ఇప్పుడు శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన 'పరాశక్తి' తెలుగు వెర్షన్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని సమాచారం. తెలుగులో విడుదల కాబోతున్న సినిమాలతో పోటీ రీత్యా పరాశక్తి' ఈ రేసు నుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు. దాంతో సంక్రాంతి రేసు నుంచి మరో మూవీ అవుట్ అయ్యిందని కన్ఫర్మ్ చేస్తున్నారు.

ఇక శివ కార్తికేయన్.. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు స్టార్ హీరో. తనదైన శైలిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్ గానే అమరన్ మూవీతో తెలుగువాళ్లకి కూడా దగ్గరైపోయారు. మేజర్‌ ముకుంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవితో జంటగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. కానీ చివరగా మురగదాస్ దర్శకత్వంలో "మదరాసి" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

'పరాశక్తి' చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వద్దమనుకున్న ఆయనకు తెలుగు రిలీజ్ వాయిదా పడడం షాక్ అనే చెప్పాలి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించగా.. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీలో హీరోలు రవి మోహన్, అథర్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కులప్పూలి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, బసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా తెరకెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+