శివాజీకి సమన్లు- సుమోటోగా స్వీకరణ: క్షమాపణ చెప్పినా వదల్లేదు
దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారట్లేదు. మరింత ముదిరాయి. దీనిపై ఆయన క్షమాపణలు సైతం చెప్పారు. అయినా కూడా అవి రేపిన ప్రకంపనలు తగ్గట్లేదు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేసింది.
దండోర ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివాజీ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై అసహనాన్ని వ్యక్తం చేశారు. "హీరోయిన్లు చీరల్లో చాలా అందంగా, నిండుగా కనిపిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు శరీరం ప్రదర్శించేలా, సామాన్లు కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అటువంటి వస్త్రధారణ అస్సలు బాలేదు" అని వ్యాఖ్యానించారు. దీనిపై చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు మనోజ్.. వంటి సెలెబ్రిటీలు స్పందించారు. నిప్పులు చెరిగారు. తోటి నటుడు చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ మనోజ్ పేర్కొన్నాడు.

శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది తెలంగాణ మహిళా కమిషన్. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు అవ్వాలని ఆదేశించింది. మహిళలను కించపరచాలనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు.
దీన్ని సుమోటోగా స్వీకరించామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1995 సెక్షన్ 16 (1) (బీ) కింద విచారణకు ఆదేశించినట్లు వివరించారు. విచారణకు శివాజీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని, సంబంధిత డాక్యుమెంట్లు లేదా ఆధారాలు సమర్పించాలని కమిషన్ పేర్కొంది. దర్యాప్తునకు పూర్తి సహకారాన్ని అందించాలని కమిషన్ శివాజీకి సూచించింది.
I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT
— Sivaji (@ActorSivaji) December 23, 2025
మరోవంక- ఈ వివాదంపై శివాజీ స్పందించాడు. క్షమాపణలు కోరాడు. ఈ ఈవెంట్ లో రెండు అన్ పార్లమెంటరీ పదాలను వాడానని, వీటివల్ల ఎవరికైనా వారి మనోభావాలు దెబ్బతింటాయని అంగీకరించాడు. తాను అమ్మాయిలందరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, హీరోయిన్ల గురించేనని వివరణ ఇచ్చాడు. హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు బట్టల వల్ల ఇబ్బందులు ఉండకూడదనేది తన ఉద్దేశమని, ఎవరినీ అవమానపర్చాలని కాదని అన్నాడు.
స్త్రీని ఎప్పుడూ ఓ మహాశక్తి, అమ్మవారిగా భావిస్తానని, వాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దనే ఉద్దేశంలో రెండు మాటలు దొర్లాయని పేర్కొన్నాడు. తన ఉద్దేశం మంచిదే అయినా ఆ పదాలు దొర్లకొండా ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. మంచి చెప్పాలనే తపన తప్ప అవమానపర్చాలనేది తన ఉద్దేశం కాదని అన్నాడు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications