రజినీకాంత్ ఫ్యాన్స్‌కి పండగే.. "నరసింహా" సీక్వెల్ వచ్చేస్తుందోచ్ !

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు బ్రాండ్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. రీసెంట్ గానే లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

డిసెంబర్ 12న తన 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 'పడయప్ప' ( తెలుగులో 'నరసింహా' )సినిమాను రీ-రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన అభిమానులకు సూపర్ స్టార్ ఓ అదిరిపోయే శుభవార్త అనౌన్స్ చేశారు. 'ది రిటర్న్ ఆఫ్ పడయప్ప' పేరుతో విడుదల చేసిన ఓ వీడియోలో రజనీ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

superstar-rajinikanth-shares-good-news-about-narasimha-movie-sequel

అభిమానులకు గుడ్ న్యూస్..

కాగా తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'నరసింహ' చిత్రానికి సీక్వెల్ రాబోతోందని ఇన్ డైరెక్ట్ గా రజినీ క్లూ ఇచ్చేశారు. ఈ సీక్వెల్ కోసం కథా చర్చలు జరుగుతున్నాయని.. అంతా అనుకున్నట్లు జరిగితే అభిమానులకు మరోసారి పండగలాంటి సినిమా అందిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రోబోకి సీక్వెల్ గా '2.0'వచ్చిందని.. త్వరలోనే జైలర్ కి సీక్వెల్ గా 'జైలర్ 2' రాబోతుందని వెల్లడించారు. 'పడయప్ప' కు రెండో భాగం ఎందుకు చేయకూడదని అనిపించిందని తెలిపారు. తొలి భాగంలో నీలాంబరి (రమ్యకృష్ణ) వచ్చే జన్మలోనైనా పగ తీర్చుకుంటానని చెబుతుందని.. అందుకే 'నీలాంబరి - పడయప్ప 2' అనే టైటిల్‌తో కథపై చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. సినిమా బాగా వస్తే.. అభిమానులకు మరో పండగే అని వివరించారు.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్ 2. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ దాదాపు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య వంటి నటులు కూడా నటిస్తున్నారని సమాచారం. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+