నా ముందే చూస్తూ అలా ఉందన్నారు ... వెక్కి వెక్కి ఏడ్చిన తెలుగు హీరోయిన్..!!
"ఈషా రెబ్బ" .. టాలీవుడ్‌లో అచ్చ తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అందం మాత్రమే కాకుండా సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిన్న సినిమాల నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి క్రమంగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
సినీ కెరీర్..
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా గుర్తింపు పొందిన ఈ భామ.. ఆ తర్వాత అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి విభిన్న కథాంశాలున్న సినిమాల్లో మెప్పించింది. భారీ స్టార్ క్యాస్ట్ లేకున్నా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్లింది. అంతే కాకుండా పెద్ద హీరోల సినిమాల్లోనూ ఈషాకు అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో పూజా హెగ్డే సరసన సెకండ్ హీరోయిన్‌గా కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అలానే థియేటర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈషా రెబ్బ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెబ్ సిరీస్‌ల ద్వారా కొత్త తరహా ప్రేక్షకులకు చేరువైంది. డిజిటల్ మీడియాలో ఆమె చేసిన పాత్రలు ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ఆమెకు సరైన బ్రేక్ దక్కడం లేదు. రీసెంట్ గానే 3 రోసెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తూ తనదైన శైలిలో రాణిస్తుంది.
ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ నటిస్తున్న తాజా చిత్రం 'ఓం శాంతి శాంతి'. తరుణ్ భాస్కర్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆమె మంచి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు కొత్త మలుపు ఇస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఇది మలయాళ మూవీ "జయ జయ జయహే"కి రీమేక్ కి తెరకెక్కింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ప్రమోషన్లలో ఈషా రెబ్బ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె తొలిసారి బహిరంగంగా వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఒక ఫోటో షూట్ సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ తన ఫోటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి చూస్తూ, "నీ మోచేతులు నల్లగా ఉన్నాయి, నువ్వు ఇంకా తెల్లగా ఉండాలి" అని అన్నారని తెలిపింది. ఆ మాటలు తనను తీవ్రంగా కలచివేశాయని ఈషా భావోద్వేగంగా చెప్పింది. ఆ రోజు చాలా ఏడ్చానని, కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండేదేమో అన్న భావన అప్పట్లో కలిగిందని వెల్లడించింది. స్కిన్ కలర్ ఆధారంగా అవకాశాలు కోల్పోవడం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న చేదు నిజమని ఆమె వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.
అంతే కాకుండా తల్లిదండ్రుల అండ లేకపోతే ఇండస్ట్రీలో ఆడపిల్లను చాలామంది టార్గెట్ చేస్తారని చెప్పింది. అలాగే అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని, తెలుగు అమ్మాయిలా రిజర్వ్‌గా ఉండకూడదని కొందరు సూచనలు చేశారని పేర్కొంది. మరోవైపు ఆమెపై వచ్చిన రిలేషన్ రూమర్స్‌పైనా ఈషా స్పష్టత ఇచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ, వాటిలో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి గాసిప్‌లను ఎవ్వరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications