నాగార్జున - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ
కింగ్ నాగార్జున తన కెరీర్ లో ఎంతోమంది యువ దర్శకులను పరిచయం చేశారు. అలాగే కొత్త కొత్తవారిని సినీరంగానికి తీసుకువచ్చారు. ఆయన వల్ల ఎంతోమంది సినీరంగంలో స్థిరపడ్డారు. టాలెంట్ ఉండే సీనియర్, జూనియర్ అనే తేడా తేకుండా సినిమా చేసేస్తారు. అలాగే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నాగార్జున ద్వారానే పరిచయం కావాల్సి ఉంది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే అది అనుకోకుండా మిస్ అయింది. దర్శకుడు విజయ్ భాస్కర్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేస్తున్నారు. ఓ తరుణంలో నాగార్జునతో మన్మథుడు సినిమాను అనుకున్నారు విజయ్ భాస్కర్. దీనికి కథ అందించింది కూడా త్రివిక్రమే.

సలహా ఇచ్చిన విజయ్ భాస్కర్
అప్పటికే విజయ్ భాస్కర్ కు త్రివిక్రమ్ రెండు కథలు వినిపించి, తాను దర్శకత్వం చేద్దామనుకుంటున్నానని చెప్పారు. దానికి విజయ్ భాస్కర్ కూడా ఓకే చెప్పారు. ఆ రెండు కథలే మన్మథుడు, నువ్వేనువ్వే. అయితే మన్మథుడు సినిమాకు దర్శకత్వం వహిద్దామని అనుకున్నప్పటికీ మొదటి సినిమాతోనే అంత పెద్ద హీరోను నియంత్రించగలనా? లేదా? అనే అనుమానంలో పడ్డాడు త్రివిక్రమ్. అప్పుడు విజయ్ భాస్కర్ ఓ సలహా చెప్పారు. మన్మథుడికి కథ అందించి, నువ్వే నువ్వే చిన్న హీరోతే చేస్తే సరిపోతుందని. దీంతో నువ్వే నువ్వే సినిమాకు తరుణ్ ను అనుకొని ఎంపిక చేసి త్రివిక్రమ్ తన మొదటి సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇప్పటి వరకు కలిసి పనిచేయలేదు
ఇలా మన్మథుడు సినిమాతోనే నాగార్జున - త్రివిక్రమ్ కాంబో రావాల్సి ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇప్పడు చేస్తారో, లేదో తెలియదు. ఏది ఏమైనప్పటికీ సినీ ప్రియులు ఓ మంచి కాంబోను మిస్ అయ్యారు. ఆ సమయంలో కనుక సినిమా వచ్చుంటే బ్లాక్ బస్టర్ గా నిలిచేదని అక్కినేని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం తన 100వ సినిమా మీద దృష్టిపెట్టిన నాగార్జున కథలను జాగ్రత్తగా వింటున్నారు. కొత్త దర్శకుడితో సినిమా ఖరారైందంటున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications