మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. ఈ ఘటనపై కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు, ఆయన తమ్మడు శ్రవణ్ కుమార్, మరో నిందితుడు కరీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రణయ్ కుటుంబానికి హానీ తలపెట్టే అవకాశం ఉందన్న కారణంతో గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ముగ్గురు నిందితులు దాదాపు ఏడు నెలలుగా వరంగల్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం వారు పిటీషన్‌లు దాఖలు చేస్తున్నా పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారు ఇంతకాలం బయటకు రాలేకపోయారు. తాజాగా పీడీ కేసులో మారుతి రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మారుతిరావు కూతురు, ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన బయటకు వస్తే ప్రణయ్ కుటుంబం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్తానని అమృత అంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు బయటకు రావడంపై కన్నకూతురు అమృత అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications