నన్ను కెలికితే భద్రచలాన్ని కూడా లాక్కుంటానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు విమర్శల పదును పెంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలపై ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. భద్రాచలం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసు వేసి కెలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కెలికితే భద్రాచలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. భద్రచలాన్ని ఏపీలో కలిపేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.













Click it and Unblock the Notifications