చంద్రబాబు మళ్లీ బీజేపీలో చేరుతారని ఓవైసీ చేసిన కామెంట్స్‌ను మీరు నమ్ముతారా..?
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు మరోసారి అవకాశం లభిస్తే.. యూటర్న్ తీసుకుంటారని అన్నారు. మళ్లీ బీజేపీకి మద్దతు ఇస్తారని, ఎన్డీఏ కూటమిలో చేరిపోతారని చెప్పారు. చంద్రబాబుకు ఈ సారి రాజకీయంగా ఎలాంటి అవకాశాలు రాకూడదని తాను కోరుకంటున్నట్లు చెప్పారు. 2004 ఎన్నికల సందర్భంగా బీజేపీతో జట్టు కట్టబోనని బహిరంగంగా క్షమాపణలు కోరిన చంద్రబాబు.. 2014 నాటికి అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అబద్ధాలు ఆడటంంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ ఉందని ధ్వజమెత్తారు. ఏపీలోని ముస్లిం ఓటర్లు ఎవరూ టీడీపీకి ఓటు వేస్తారని తాను అనుకోవట్లేదని అన్నారు.
మొత్తానికి ఓవైసీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...? ఒకవేళ ఏకీభవిస్తే మీ కామెంట్ ఇక్కడ రాయగలరు.













Click it and Unblock the Notifications