సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థానాల్లో పాగా వేస్తామని భావించినా చివరకు 9 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయినా.. ఓటు శాతం పెరిగిందని అన్నారు. గతంలో కన్నా 6శాతం ఓట్లు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలుపు గెలుపుకాదన్న ఆయన.. అది నామమాత్ర విజయమేనని అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో కేవలం 10 వేల ఓట్ల మెజార్టీతో సాధించిన విజయం అసలు విజయమే కాదని చెప్పారు.

దేశంలో ప్రధాని మోడీ వేవ్ కనిపించిందన్న కేటీఆర్... ఆ కారణంగానే బలహీనమైన అభ్యర్థులున్న స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధ్యమైందని చెప్పారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదని అన్నారు. రాష్ట్రంలో 16సీట్లు గెలవాలన్న పట్టుదలతో పనిచేశామని, ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది తమకు స్పీడ్ బ్రేకరేనన్న కేటీఆర్ టీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తమ్మీద సీట్లు తగ్గినా ఓట్లు పెరిగాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications