ఏపీ సీఎం జగన్‌ను సాధినేని యామిని నిజంగా అవమానించారా? మీ కామెంట్ ఏంటి?

అమరావతి : ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతి పర్యటనలో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్లు పట్టుకునేందుకు లైన్‌లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి.. వీడా మోడీ మెడలు వంచి మనకు హోదా రైల్వే జోన్ తెచ్చేది.. అంటూ ఆమె ఫేస్ బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు కురిపించారు.

సాధినేని యామినిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె కొత్త రాగం అందుకున్నారు. ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను టార్గెట్ చేసిన కొందరు సోషల్ మీడియా వేదికగా తన పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి పిచ్చి పోస్టులు పెడుతున్నారని కంప్లైంట్ చేసింది. అంతేకాదు తనకు ఎక్కడెక్కడి నుంచో తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన ఆమె.. వారు తనతో అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా తన కుటుంబసభ్యులను కూడా బెదిరిస్తున్నారని ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఫిర్యాదు చేశారు.

sadineni yamini really insulted AP cm jagan? Post your comment.

తన ఫేస్‌బుక్ అఫీషియల్ అకౌంట్ సాధినేని యామినీ శర్మ పేరుతో ఉంటుందని, యామిని సాధినేని, యామిని సాధినేని యువసేన లాంటి ఫేక్ అకౌంట్లు సృష్టించి పీఎం మోడీని, సీఎం జగన్‌ను తిట్టానని జుగుత్సాకరమైన పోస్టులు పెడుతున్నారని యామిని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తే తనపై ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే సాధినేని యామినిపై వైసీపీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారంటూ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ మహిళా విభాగం నాయకురాలు ఝాన్సీ కంప్లైట్ చేశారు. యామిని నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిమామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

ఇలా పరస్పర ఫిర్యాదులకు కారణమైన సాధినేని యామినీ ఫేస్‌బుక్ కామెంట్స్‌ నిజమైనవని మీరు భావిస్తున్నారా? వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదం రాజుకోవడంతో ఆమె ప్లేటు ఫిరాయించి ఫేక్ అకౌంట్ల పేరుతో ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+