వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠ పెంచాయి. కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠం ఎక్కుతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు అవసరం కాగా... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 300లకు పైగా సీట్లు గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. రెండు సంస్థలు మాత్రం ఎన్‌డీఏకు మెజార్టీ తగ్గినా అతిపెద్ద కూటమగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డాయి.

Share your opinion on Exit polls predicting second term for PM Narendra Modi

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో 80స్థానాల్లో 71 తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఈసారి 40 నుంచి 50స్థానాలు కోల్పోతుందని సర్వే లెక్కలు స్పష్టం చేశాయి. అయితే బెంగాల్, ఒడిశాల్లో ఆ లోటు భర్తీ చేసుకుంటాయని అంచనా వేశాయి. కీలకమైన హిందీ రాష్ట్రాల్లో తన ప్రాభవానని మరోసారి నిలుపుకోనున్న బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పుంజుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని అంచనా వేశాయి. కేంద్రంలో మరోసారి మోడీకి తిరుగులేదంటున్న ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

English summary
Share your opinion on Exit polls predicting second term for PM Narendra Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X