వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఫోన్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించడంపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రకటించిన ఆయన.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని ఆదేశించారు. ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు సైతం సరిగా చదవడం, రాయలేని స్థితిలో ఉన్నారు. దీంతో టీచర్లు క్లాస్ రూంలో ఉన్నప్పుడు కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురం రైతులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాపై ఫోకస్ చేసిన అధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి పెట్టారు.

Teachers were instructed not to use mobile phones in the classroom In AP

సెల్‌ఫోన్లపై నిషేధంతో పాటు ప్రతిపాఠశాలలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్కూల్ పని వేళల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండేలా చూడటంతో పాటు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయం తీసుకుంది. క్లాస్‌రూంలో టీచర్లు సెల్‌ఫోన్ వాడకుండా ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Teachers were instructed not to use mobile phones in the classroom In AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X