Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియన్ నేవీ తీపికబురు.. భారీ జీతంతో 1315 ఉద్యోగాలు !

నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ నేవీ తీపికబురు ప్రకటించింది. దేశ రక్షణలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.63,200 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, జీతం వంటి పలు వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

1315-jobs-with-huge-salaries-in-indian-navy

విద్యార్హతలు..

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి (SSC) పాస్ అవ్వాలి. అదనంగా ITI పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం లభిస్తుంది.

మొత్తం ఖాళీలు..

ఇండియన్ నేవీలో మొత్తం 1315 స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాగా స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ (రెగ్యులర్) 1266 పోస్టులు.. స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ (బ్యాక్‌లాగ్) 49 పోస్టులు ఈ మేరకు భర్తీ చేయనున్నారు.

జీతం..

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. అంతే కాకుండా అదనంగా ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పెన్షన్, మెడికల్, ట్రావెల్ అలవెన్స్, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.

వయస్సు..

  • కనీస వయస్సు: 18 ఏళ్లు
  • గరిష్ట వయస్సు: 25 ఏళ్లు
  • OBCలకు 3 ఏళ్ల సడలింపు
  • SC/STలకు 5 ఏళ్ల సడలింపు
  • దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు

దరఖాస్తు గడువు..

2025 ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2, 2025

దరఖాస్తు విధానం..

ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://indiannavy.gov.in/ ను సందర్శించి నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనలు ఫాలో అనుసరించాలి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ట్రేడ్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ట్రేడ్ టెస్ట్‌లో ప్రాక్టికల్ నైపుణ్యాలను అంచనా వేస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+