ఎయిమ్స్‌లో 3,501 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్ !
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర AIIMS కేంద్రాల్లో గ్రూప్-బీ, గ్రూప్-సీ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,501 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విద్యార్హత..
పోస్టును బట్టి టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంసీఏ, బీటెక్/ఎంటెక్/బీఈ, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, బీఫార్మసీ పాస్ అయి ఉండాలి. కొన్నిపోస్టులకు సంబంధిత రంగంలో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ అవసరం.

పోస్టుల వివరాలు..
- డైటీషియన్
- అసిస్టెంట్ డైటీషియన్
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- ఫార్మసిస్ట్
- టెక్నీషియన్
- స్టాఫ్ నర్స్
- లాబ్ టెక్నీషియన్
- డెంటల్ టెక్నీషియన్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- డ్రైవర్
- కాషియర్
- ఓటి అసిస్టెంట్
- రేడియోగ్రాఫర్
- ఈసీజీ టెక్నీషియన్
- మెకానిక్
- CSSD టెక్నీషియన్
- అటెండెంట్
పోస్టులు ఉన్నాయి.
వయస్సు పరిమితి..
కనీసం 18 ఏళ్లు - గరిష్ఠంగా 35 ఏళ్లు.
OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు.
SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు.
దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు.
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్/ఓబీసీ: రూ.3,000
SC/ST/EWS: రూ.2,400
దివ్యాంగులకు: ఫీజు మినహాయింపు.
దరఖాస్తు విధానం..
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్: https://rrp.aiimsexams.ac.in/ ని చూడొచ్చు.
ఇంపార్టెంట్ డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 12
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 12, 2025
పరీక్షలు..
ప్రిలిమినరీ - సెప్టెంబర్ 14
మెయిన్ పరీక్షలు - సెప్టెంబర్ 27












Click it and Unblock the Notifications