2025లో మీ ఐటీ జాబ్ పోయిందా.. 2026 లో ఇలా చేస్తే మీకు జాబ్ పక్కా
2025 ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఐటీ రంగంలో ఎన్నడూ చూడని విధంగా ఏఐ రాకతో ఏకకాలంలో జీవితాలు తలకిందులయ్యాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేదు, హై శాలరీ.. లో శాలరీ అనే భేదాలు లేవు.. ఉన్నపళంగా అంతా ఊస్టింగ్ అయ్యారు. సాఫ్ట్ వేర్ వాళ్లకే పిల్లనిస్తాం అనే స్టేజ్ నుంచి సాఫ్ట్ వేర్ అంటా గ్యారంటీ లేని జాబ్స్ అనే దయనీయ స్థితికి తెచ్చిపడేసింది 2025. లక్షలాది మందిని రోడ్డున పడేసింది.
రక్తకన్నీరే..
2025 లో ఏఐ, ఆటోమేషన్ రాక ఎందరి జీవితాల్లో సంతోషాన్ని నింపిందో తెలియదు కానీ.. ఐటీ ఉద్యోగులతో రక్తకన్నీరు పెట్టించింది. టెక్ దిగ్గజాలు మొదలు కొని స్టార్టప్ ల వరకూ 'పింక్ స్లిప్పుల' పరంపర ఇంకా కొనసాగుతోంది. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా లేక చాలా మంది ర్యాపిడో నడుపుకుంటూ.. ఫుడ్ డెలివరీలు చేసుకుంటూ దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు.

టెక్ లేఆఫ్స్ ను ట్రాక్ చేసే 'లేఆఫ్స్.ఎఫ్ వైఐ' నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొత్తంగా.. సుమారు 257 ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను వందల నుంచి పదుల సంఖ్యకు పరిమితం చేసుకున్నాయి. వీటిల్లో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, టీసీఎస్, గూగుల్, ఇన్ఫోసిస్ వంటివి సైతం నిలిచాయి. ఫలితంగా 1,22,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ఐటీలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి 2025లో పరాకాష్టకు చేరుకోవడం కూడా పరిస్థితిని మరింత ఘోరంగా తయారుచేశాయి.
లాభాలు కాదు కంపెనీ నడిపితే చాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ రాకతో మనుషులతో పనిలేకుండా పోయింది. మ్యాన్ పవర్ తగ్గించి ఏఐను ఇన్స్ఠాల్ చేయడంతో రోజూ చేసే రొటీన్ పనులను ఇప్పుడు AI తో క్షణాల్లో జరిగిపోతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతున్నాయి. లాభాల సంగతి తర్వాత ముందు కంపెనీలను నడిపితే చాలు అనుకుంటున్నారు చాలా మంది టెక్ దిగ్గజాలు. కనీసం మెయింటెనెన్స్ కు డబ్బులు వస్తే చాలు అని ప్రాజెక్టుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ.. కొత్త నియామకాలకు స్వస్తి పలికారు.
సైబర్ సెక్యురిటీ, ఎథికల్ హ్యాకింగ్..
2025 ఐటీ డౌన్ ఫాల్ ఇయర్. ఇలాంటి టర్నింగ్ పాయింట్ లో కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది. AI కి అప్ డేట్ కాకపోతే లైఫ్ లేదు అనే స్టేజ్ కు అందరూ వచ్చేశారు. ఎంత సీనియర్ అయినా సరే.. ఇప్పుడు ఫస్ట్ నుంచి కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడున్న స్కిల్స్ కు తోడుగా మరిన్ని మల్టీ టాలెంట్ యాడ్ చేసుకోవాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ పై బాగా పట్టు సాధించాలి. ముఖ్యంగా సైబర్ సెక్యురిటీ పై ఎంత బాగా గ్రిప్ సంపాదిస్తే బ్యాంకింగ్ రంగలో అంత మంచి అవకాశాలు ఉన్నాయి.
చదవాల్సింది చాలా ఉందన్న మాట..
డిజిటల్ భద్రతకు డిమాండ్ పెరుగుతుంది. ఎథికల్ హ్యాకింగ్ పై చాలా మందికి ఆసక్తి పెరుగుతుంది. టెక్నాలజీ ప్రతిరోజూ మారుతుంది కాబట్టి డైలీ లర్నింగ్ పై ఫోకస్ పెట్టాల్సిందే. రేపటి పోటీ ప్రపంచంలో జెన్ జీ తిరుగులేని శక్తిమంతులు. వారితో పోటీ పడుతూ మీరు కూడా ముందుకు సాగాలంటే వారిలా ఆలోచించాలి. వారి కంటే బాగా పని చేసి చూపించాలి. నేర్చుకోవడానికి సిగ్గుపడకండి. ఎంత నేర్చుకుంటే అంత భవిష్యత్తు. చదవాల్సింది చాలా ఉందనే కోణంలో మీ ఆలోచన ఉంటే.. మీరు అద్భుతాలు చేస్తారు.












Click it and Unblock the Notifications