ఆర్ఆర్‌బి అభ్యర్థులకు అలర్ట్.. 41,500 ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..
ఆర్ఆర్‌బి అభ్యర్థులకు ముఖ్య గమనిక.. రైల్వేశాఖలో 41,500 ఉద్యోగాల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, వాటి పరీక్షల తేదీలను కూడా ఆర్ఆర్‌బీ ఇటీవలే విడుదల చేసింది. తాజాగా, ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌లో పలు మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటి రివైజ్‌డ్ నోటీసును కూడా ఆర్ఆర్‌బీ విడుదల చేసింది. ఆర్‌పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్ష షెడ్యూల్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపింది.
ఈ పరీక్షలన్నీ వచ్చే (నవంబర్)నెల డిసెంబర్ నెలల్లోనే జరగునున్నట్లు పేర్కొంది. అయితే, పరీక్షలకు పది రోజుల ముందు ఎగ్జామ్ సిటీ, పరీక్ష తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచునున్నట్లు వివరించింది. ఇక, అడ్మిట్ కార్డుల విషయానికొస్తే, పరీక్షల నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డును తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ఆధార్ లింక్‌డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి.

వివిధ విభాగాల్లో పోస్టులు..
ఆర్ఆర్‌బి గతంలో 41,500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దేశంలోని అన్నీ రైల్వే జోన్లలో కలిపి మొత్తం 18799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్ ఎస్సై పోస్టులు, 14298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక, ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మారిన ఆర్‌ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
పోస్టులు పరీక్ష తేదీలు
అసిస్టెంట్ లోకో పైలట్ 25.11.2024 నుంచి 29.11.2024 వరకు
ఆర్‌పీఎఫ్ ఎస్సై 02.12.2024 నుంచి 12.12.2024 వరకు
టెక్నీషియన్ 18.12.2024 నుంచి 29.12.2024 వరకు
జూనియర్ ఇంజినీర్ 13.12.2024 నుంచి 17.12.2024 వరకు












Click it and Unblock the Notifications