అభ్యర్థులకు అలర్ట్.. సీటెట్ డిసెంబర్ సెషన్ 2024 పరీక్ష తేదీ మార్పు...
సీటెట్ అభ్యర్థులకు అలర్ట్.. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు సెషన్ 2024 నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఎస్ఈ సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష తేదీలో మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1వ తేదిన పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, డిసెంబరు 15వ తేదిన పరీక్ష నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
విద్యార్హతలు..
ఈ పరీక్ష రాయాలనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

పరీక్ష ఫీజు వివరాలు..
సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబిసి అభ్యర్థులు ఫీజు కింద ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు పేపర్లకయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక్క పేపర్‌కయితే రూ.500 చెల్లించాలి. అదే రెండు పేపర్లకు అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 15న సీటెట్ డిసెంబర్ సెషన్ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..
గుంటూరు
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
వరంగల్
ముఖ్యమైన తేదీలివే..
సీటెట్ డిసెంబరు 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2024
సీటెట్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.10.2024 (11:59 PM)
సీటెట్ డిసెంబరు 2024 పరీక్ష తేదీ: 15.12.2024












Click it and Unblock the Notifications