AP EAPCET 2026: ఎంసెట్ ఆన్సర్ కీ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్ పరీక్ష (AP EAPCET 2026) తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇవాళ ఆన్సర్ కీని ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నారు. ఎంసెట్ పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ సమాధానాలు ఎంత వరకూ కరెక్టో తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి తరఫున ఎంసెట్ పరీక్ష నిర్వహించిన కాకినాడ జేఎన్టీఏ వీటికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

విద్యార్ధులు అలర్ట్ : ఎంసెట్, ఫార్మా, అగ్రికల్చర్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.
విద్యార్ధులు అలర్ట్ : ఎంసెట్, ఫార్మా, అగ్రికల్చర్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.

మే 12 నుండి 20, 2026 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌లతో పాటు ఆన్సర్ కీలను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. APSCHE పోర్టల్‌లో లింక్ అందుబాటులో ఉంటుంది. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు, తాత్కాలిక సమాధానాలలో ఏవైనా లోపాలు గుర్తిస్తే, ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా అభ్యంతరాలు లేవనెత్తడానికి, రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాలని అధికారులు తెలిపారు. అలాగే అభ్యర్ధులు తమ వాదనలను సమర్థించడానికి తగిన ఆధారాలను అప్‌లోడ్ చేయాలి. ప్రతి ప్రశ్నకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వాదనలు కరెక్ట్ అయితే రుసుము తిరిగి వస్తుంది.

AP EAPCET Answer Key 2026 Out How to Download Check and Challenge Provisional Key
AP EAPCET 2026 Results: ఈసారి ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే ?
AP EAPCET 2026 Results: ఈసారి ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే ?

ఎంసెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ మే 25గా నిర్ణయించారు. AP EAPCET 2026 ఫలితాలు, ర్యాంక్ కార్డులు జూన్ తొలి వారంలో విడుదల కాబోతున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 2026 నుండి ప్రారంభం కానుంది. ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించి, "AP EAPCET 2026" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ "Question Papers with Preliminary Keys", "Response Sheets" అనే లింక్‌లు ఉంటాయి. మీ స్ట్రీమ్ (ఇంజనీరింగ్/వ్యవసాయ & ఫార్మసీ), పరీక్ష తేదీ, షిఫ్ట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, EAPCET హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, 'Get Details' పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ పీడీఎఫ్ వస్తుంది. దానిని సేవ్ చేయడానికి డౌన్‌లోడ్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. మీ రెస్పాన్స్ షీట్‌తో మాస్టర్ కీని సరిపోల్చి, అంచనా స్కోర్‌ను లెక్కించుకోవాలి. అలాగే భవిష్యత్ సూచన కోసం ఒక కాపీని ప్రింట్ తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+