AP SSC Exams 2025:టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!

ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకూ ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు ఉంటాయి.

ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు విద్యాశాఖ మంత్రి ఎక్స్ ద్వారా ఓ మెసేజ్ పంపారు. ఇందులో ఆయన పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని విద్యార్ధులకు మంత్రి లోకేష్ సూచించారు.

ap education minister nara Lokesh s message to ssc examination candidates

ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది అని లోకేష్ వారికి తెలిపారు. ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చివర్లో విజయీభవ అంటూ తన మెసేజ్ ను లోకేష్ ముగించారు.

ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షలకు మొత్తం 6.49 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే పరీక్షకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణం అనుమతిస్తారు. మొత్తం 3450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు 0866-2974540 హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+