ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..
విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఏపీలో ఫైనల్ ఎగ్జామ్స్ కి సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా త్వరలో నిర్వహించబోతున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు.
తాజా ప్రకటన ప్రకారం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్..
ఏపీ ఈఏపీసెట్ - మే 19 నుంచి 27 వరకు
(అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు - మే 19, 20 )
( ఇంజినీరింగ్ పరీక్షలు - మే 21 నుంచి 27 వరకు )

ఏపీఆర్‌సెట్ - మే 2 నుంచి 5 వరకు
ఏపీ ఈసెట్ - మే 6
ఏపీ ఐసెట్ - మే 7న
ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ - మే 25
ఏపీ పీజీఈసెట్ - జూన్ 5 నుంచి 7 వరకు
ఏపీ ఎడ్‌సెట్ - జూన్ 8
ఏపీ పీజీసెట్ - జూన్ 9 నుంచి 13 వరకు
ఆయా తేదీలలో సంబంధిత పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
To all aspiring students, this is your moment to step forward with confidence and determination! APSCHE has officially declared the schedule for the 2025 AP Common Entrance Tests—so stay focused, prepare well, and give it your best. Wishing you all great success in your journey… pic.twitter.com/GOQXEWvdEZ
— Lokesh Nara (@naralokesh) February 13, 2025












Click it and Unblock the Notifications