ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు అంశం పైన స్పష్టత ఇచ్చింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్ మార్పు.. పరీక్షల నిర్వహణ పైన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన ప్రభుత్వం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇంటర్ పరీక్షల పైన కొనసాగు తున్న సస్పెన్స్ కు తెర పడింది.

యథాతధం
ఏపీలో ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు యధాతధంగా జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంటర్ విద్య సిలబస్ లో మార్పులు.. పరీక్షల సంస్కరణల పైన ఇంటర్ అధికారులు అభిప్రాయ సేకరణ చేసారు. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం పైన సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో, మెజార్టీ అభిప్రాయం మేరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ కోసం అనేక సూచనలు ప్రభుత్వానికి అందాయి.

AP Govt clarifies over cancellation of inter first year examination details here

సిలబస్ పై క్లారిటీ
పరీక్షల నిర్వహణ లేకపోతే విద్యార్ధులు దృష్టిపెట్టరని, తద్వారా సబ్జెట్ పైన అవగాహనా సామర్థ్యా లు తగ్గిపోతాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. అదే విధంగా అంతర్గత మార్కుల విధానం పైన పలు సూచనలు వచ్చాయి. దీంతోచ, అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించు కుంది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవని... రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇస్తారని అధికారులు వెల్లడించారు.

కీలక నిర్ణయాలు
అదే విధంగా వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్‌ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకొనేలా నిర్ణయించారు. వీటి నిర్వహణ పైన ఇంటర్ బోర్డు అధికారికంగా తీర్మానం చేసి ప్రకటన చేయనుంది. తాజా నిర్ణయాలతో ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు - సిలబస్ పైన పూర్తి స్పష్టత వచ్చినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+