AP Intermediate exams: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు- అభ్యర్ధులకు సూచనలివే..!
ఏపీలో ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఎల్లుండి ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై.. 19 వరకూ జరగనున్నాయి. అలాగే రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై.. 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పటికే ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
ఇంటర్ మీడియట్ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు bieap.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. వీటిని డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకుని పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. కాలేజీల్లో నేరుగా కూడా హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల కోసం ఇంటర్ బోర్డు పలు సూచనలు చేస్తోంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వీటిని తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్లను తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు తీసుకు వెళ్లాలి. అలాగే కళాశాలల ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి. పరీక్షకు వెళ్లేవారు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అలాగే విద్యార్ధులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి.












Click it and Unblock the Notifications